How to Modify Your Address or Assembly Constituency in Voter ID
ఓటర్ ఐడీ కార్డును ఎలా మార్చుకోవాలో తెలుసా?
మీకు ఓటర్ ఐడీ కార్డు ఉండి, మీరు మరో రాష్ట్రానికి కనుక మారిపోతే, మీ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్చుకోవడానికి పద్ధతి ఉంది. ఎలా మార్చుకోవాలో తెలుసా?*
మొదట, మీరు మీ ఓటరు ఐడీ కార్డులో అడ్రస్ ఎందుకు మార్చుకోవాలో కారణాలు తెలుసుకోవాలి.
మీరు ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో అసెంబ్లీ నియోజకవర్గానికి మారితే మీ ఓటరు కార్డు పైన అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది.
మీ పాత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్త అసెంబ్లీ నియోజకవర్గంలోకి మీ పేరును బదలీ చేయాలి.
మీరు కొత్త నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడ కొత్తగా ఓటరు కార్డు కోసం నమోదు చేసుకోవడానికి బదులు, మీ అడ్రస్ అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇందుకు ఎన్నికల సంఘం ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా ఆమోదిస్తుంది.
ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?
మొదట మీరు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లోకి (https://www.nvsp.in) వెళ్లాలి.
- అక్కడ ఉన్న కరెక్షన్ (సరిచేసుకోవడం) పైన క్లిక్ చేయండి.
- ఫామ్ 8 పేజీ పైన క్లిక్ చేయండి.
- ఎక్కడ మీరు అప్ డేట్ చేయాలనుకుంటున్నారో లేదా కరెక్షన్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఉంటుంది.
- ఆ ఫామ్‌లో వివరాలు నింపండి.
- అక్కడ మీ రాష్ట్రం/పార్లమెంటరీ నియోజకవర్గం/అసెంబ్లీ నియోజకవర్గం పేర్లను పేర్కొనాలి.
- మీ జెండర్, వయస్సు, ఎలక్టోరల్ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- తల్లి/తండ్రి/భర్త ఇలా కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వాలి.
- పూర్తి చిరునామా రాయండి.
- ఓటర్ ఐడీ వివరాలు ఇవ్వండి.
- మీ లేటెస్ట్ ఫోటో, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌లతో కలిపి డాక్యుమెంట్ అప్ లోడ్ చేయండి.
- ఇప్పుడు ఎక్కడ లేదా ఏమి కరెక్షన్/అప్ డేట్ చేయాలనుకుంటున్నారో అది చేయండి.
- ఏ ప్రాంతం నుంచి వచ్చారో పేర్కొనండి.
- వివరాలు సరిచేయడానికి అభ్యర్థన తేదీని పేర్కొనండి.
- మీ కాంటాక్ట్ వివరాలు ఇవ్వండి.
- మరోసారి అంతా సరిచూసుకోండి. ఆ తర్వాత సబ్‌మిట్ కొట్టండి.
ఆఫ్‌లైన్ మోడ్
- అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నుంచి ఫామ్ 8 తీసుకోండి. లేదా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవ్లి.
- సరైన విధంగా ఫామ్ 8 నింపండి. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి.
- ఆ తర్వాత స్వయంగా వెళ్లి.. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు ఇవ్వండి. పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు.
కరెక్షన్ లేదా సరిచేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్లు
- రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోజోలు
- అడ్రస్ ప్రూఫ్‌లు
- బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్
- రేషన్ కార్డు
- పాస్‌పోర్ట్
- డ్రైవింగ్ లైసెన్స్
- ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్
- రెంటల్ అగ్రిమెంట్
- నీళ్లు, గ్యాస్, టెలిఫోన్, రెంటల్ అగ్రిమెంట్ వంటి యుటిలిటీ బిల్స్
- వయస్సుకు సంబంధించిన ఆధారం
- ఆధార్ కార్డ్
- డ్రైవింగ్ లైసెన్స్
- పాన్ కార్డు
- రెండు వైపులా ఉండేలా ఓటర్ ఐడీ కార్డు కాపీ
COMMENTS