How do you build bridges over rivers even if the water is flowing?
నీరు ప్రవహిస్తున్నా నదులపై వంతెనలెలా నిర్మిస్తారు?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
నీరు ప్రవహిస్తున్నా నదులపై వంతెనలెలా నిర్మిస్తారు?
మామూలుగా వంతెనలు నదులపై వర్షాలుపడని ఆఫ్ సీజన్‌లో నిర్మిస్తారు. అప్పుడు నదిలో నీరు వేగంగా ప్రవహించకుండా చాలా వరకు నిలకడగా ఉంటుంది. అప్పుడు వంతెనకు స్తంభాలు నిర్మించవలసి వచ్చిన చోట నీటిలో 20 నుంచి 40 సెంటిమీటర్ల వ్యాసం గల నీరు చొరబడని పైపులను కాంక్రీటు వేయవలసిన ప్రదేశం వరకూ దించుతారు. అంతకు ముందే నిర్మించిన ప్లాట్‌ఫాం నుంచి పైపుల ద్వారా ఇనుము, స్టీలు కమ్మీలను లోనికి పంపుతారు. నీరు కలుపని గులకరాళ్లు, సిమెంటు, ఇసుక మిశ్రమాన్ని కూడా ఈపైపు ద్వారా జారవిడుస్తారు. దీనిని 'డ్రైమిక్చర్' అంటారు. పైపు నుంచి కిందికి దిగిన ఈ పొడి మిశ్రమం అడుగున ఉన్న నీటితో కలిసి గట్టిపడి రాయిలా మారుతుంది. పైపును దఫాల వారిగా పైకి లాగుతూ ఈ మిశ్రమాన్ని పైపుల్లో వేస్తూ వంతెనకు కావలసిన ఎత్తున స్తంభాన్ని నిర్మిస్తారు.
నీటి వేగం ఎక్కువగా ఉంటే, యంత్రాల ద్వారా నీటి వేగాన్ని తగ్గించి, నీరు ప్రవహించే దిశను మారుస్తారు. నదిలో ఎక్కువ లోతుగా ఉన్న ప్రదేశాలకు కాంక్రీటును చేరవేయాలంటే పెద్ద బకెట్లలో కాంక్రీటును నింపి, దాని పైభాగాన్ని నీరు చొరబడకుండా కాన్వాస్‌తో కప్పుతారు. ఈ బకెట్‌ను నీటిలో నిర్ణీత స్థలానికి దింపి, బకెట్ అడుగున ఉన్న మూతను నిదానంగా తొలగిస్తారు. తర్వాత కాంక్రీటును అక్కడ జారవిడుస్తారు. ఖాళీ బకెట్‌ను పైకిలాగి మళ్లీ కాంక్రీటుతో నింపుతారు. ఈ ప్రక్రియలో పెద్ద క్రేన్ల కన్వేయర్ బెల్టుల ప్రమేయం ఎంతో ఉంటుంది.
COMMENTS