Hashtags
అసలు హ్యాష్‌ట్యాగ్ అంటే ఏంటీ?..సోషల్ మీడియాలో ఉపయోగించే ఈ ట్యాగ్‌లను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?.. ఆసక్తికర విషయాలు
ప్రస్తుతం అందరూ సోషల్ మీడియానే ఉపయోగిస్తున్నారు. మీరు సోషల్ మీడియా పోస్ట్‌లో # (హ్యాష్‌ట్యాగ్) ట్యాగ్‌ని వ్రాసి లేదా చూసి ఉంటాం. ఇది చూస్తుంటే ఈ హ్యాష్‌ట్యాగ్ ఏంటి అనే ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంటుంది. చాలా మంది తమ పోస్ట్‌లలో హ్యాష్‌ట్యాగ్‌లను ఎందుకు ఉపయోగిస్తున్నారు..? దీన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు తెలియకపోతే.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హ్యాష్‌ట్యాగ్ అంటే ఏంటి?
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇస్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్‌లలో ఫోటో, వీడియో, పోస్ట్, కామెంట్స్ లేదా ఈవెంట్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించబడతాయి. దీనర్థం ట్యాగ్ చేయడం. మీరు మీ పోస్ట్ ఈవెంట్‌ల సందేశంలో ఏదైనా ముందు హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచినట్లయితే.. ఆ హ్యాష్‌ట్యాగ్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆ పోస్ట్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు అదే పేజీలో పొందుతారు.
సోషల్ మీడియా అనేది ప్రపంచం నలుమూలల నుంచి ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే వేదిక. ఆ తర్వాత ప్రపంచంలో ఏ విషయం చర్చ జ రుగుతుందో హ్యాష్ ట్యాగ్ చూపిస్తుంది. హ్యాష్‌ట్యాగ్‌లు భావసారూప్యత ఉన్న వ్యక్తులను ఏకం చేస్తుంది. వారి స్వంత ప్రయోజనాల కోసం లేవనెత్తిన సమస్యలను ఇతరులకు తీసుకువెళ్తుంది. హ్యాష్‌ట్యాగ్‌ను మొదటిసారిగా 1988లో ఇంటర్నెట్ రిలే చాట్ అనే ప్లాట్‌ఫారమ్‌లో ఉపయోగించారు.
సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ఇలా పనిచేస్తాయి
ఇన్‌స్టాగ్రామ్..
తాము తినే ఫుడ్ నుంచి మొదలు వీధిలో తిరుగుతున్న కుక్క ఫోటోను క్లిక్ చేయడం వరకు.. చాలా మంది దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. కానీ అక్కడ అది మన అనుచరులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్ట్ రీచ్‌ను పెంచడానికి.. సరైన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం చాలా ముఖ్యం.
కొంతమంది తమ క్యాప్షన్‌లతో హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తారు. క్యాప్షన్‌లలో హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం మంచిది. మీరు వీడియో లేదా ఫోటో పోస్ట్ చేసిన తర్వాత.. కామెంట్‌కు వెళ్లి అన్ని హ్యాష్‌ట్యాగ్‌లను జోడించండి. తద్వారా ఎవరినైతే చేరాలని మీరు పోస్ట్ చేసారో వారిని మీ పోస్ట్‌ను చేరుతుంది. మీ పోస్ట్ మరింత మందికి చేరేలా చేయడానికి మీరు ఇస్ట్రాగ్రామ్‌లో కొన్ని ప్రముఖ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించవచ్చు.
ఫేస్ బుక్..
హ్యాష్‌ట్యాగ్‌ల ప్రయోజనాన్ని పొందడానికి.. యూజర్లు ప్రొఫైల్ పబ్లిక్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఫేస్ బుక్‌లో నిర్దిష్ట హ్యాష్‌ట్యాగ్ లేదా పోస్ట్‌ను గుర్తించడానికి, యూజర్లు ఫేస్ బుక్‌లో సెర్చ్ బార్‌కి వెళ్లడం ద్వారా లేదా దానికి సంబంధించిన అన్ని పోస్ట్‌లను చూడటానికి అనే పదాన్ని జోడించడం ద్వారా సెర్చ్ చేయవచ్చు. ఇస్ట్రాగ్రామ్, ట్విట్టర్ కంటే ఫేస్ బుక్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు తక్కువ ప్రభావం చూపుతాయి. ఫేస్‌బుక్‌లో ఒకటి లేదా రెండు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం ద్వారా ఆ పోస్ట్ రిజల్ట్‌ను 593 శాతం పెంచవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో, ఒక పోస్ట్‌లో 3 నుంచి 5 హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం వల్ల దాని రిజల్ట్ 416 వరకు ఉంటుందని అంటున్నారు. ఈ విధంగా చూస్తే, ఫేస్‌బుక్‌లో ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌ల వాడకం అనుకున్న ఫలితాలను ఇవ్వదని తేలింది. దాని ప్రయోజనం కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబాట్టి ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిండం ఉత్తమం.
ట్విట్టర్
హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడానికి మంచి ప్లాట్‌ఫారమ్ ఇదే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా లైవ్ డిష్కషన్లు జరుగుతాయి. ఇక్కడ మీరు 140 అక్షరాల పరిమితిలోపు హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించవచ్చు. అందుకే ట్విట్టర్‌లో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగించడం మంచిది.
ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు.. అది పోస్ట్‌కు సంబంధించినదిగా ఉండే చూసుకోవాలని గుర్తుంచుకోండి. మీరు ట్వీట్‌లో తాజ్‌మహల్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటే.. మీరు ఆ ట్వీట్‌లో #తాజ్‌మహల్ హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆ కంటెంట్‌లోని మెయిన్ బాడీలో తాజ్‌మహల్ ముందు # చిహ్నాన్ని జోడించడం మంచిది.
ఈ # ట్యాగ్ వలె పని చేస్తుంది
- చాలా మంది వినియోగదారులు ప్రతి స్టేటస్‌తో హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే హ్యాష్‌ట్యాగ్‌లు అన్ని రకాల పదాలపై పని చేయవు. ఇది ఆల్ఫాన్యూమరిక్ పదాలతో మాత్రమే ఉపయోగించబడుతుంది.
- హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేక అక్షరాన్ని ఉపయోగించినట్లయితే.. అది పని చేయదు.
- హ్యాష్‌ట్యాగ్‌ని వర్తించే ముందు.. మీరు ట్యాగ్ చేస్తున్న పదం మీ కథనానికి సంబంధించినదని నిర్ధారించుకోండి.
- మీ స్టోరీకి సంబంధం లేని ట్యాగ్‌ని మీరు పెట్టకూడదు.
- మీరు దానిని ఏదైనా ఫోటోలో ఉపయోగిస్తే.. అప్‌లోడ్ చేసిన ఫోటోను అందరూ చూడగలరు.
- మీరు మీ వ్యక్తిగత విషయాలపై ఏదైనా వ్రాసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటే.. దాన్ని అందులో ఉపయోగించవద్దు.
COMMENTS