Gas booking through WhatsApp
LPG: వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్... ఇలా చెయ్యండి
ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీరు... గ్యాస్ బుక్ చేసుకోవడమే కాదు... మీ బ్యాంక్ అకౌంట్లో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ గత ఆరు నెలల్లో ఎన్నిసార్లు, ఎంతెంత డిపాజిట్ అయ్యిందో తెలుసుకోవచ్చు, అంతే కాదు మీరు ఎన్ని సిలిండర్లు వాడారు, ఇంకా ఎన్ని వాడొచ్చు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో వాట్సాప్ వాడకం కామన్. అందుకే... గ్యాస్ బుకింగ్ కూడా వాట్సాప్ ద్వారా చేసుకునే వీలు కల్పించారు. ప్రస్తుతానికి HP గ్యాస్ వినియోగదారులు ఇలా వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఆ ప్రక్రియను తెలుసుకుందాం.
- HP గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- HP గ్యాస్ బుకింగ్ వాట్సాప్ నంబర్ ఇదే 9222201122
- నంబర్ సేవ్ చేశాక...
- వాట్సాప్ కాంటాక్ట్స్‌లో గ్యాస్ బుకింగ్ నంబర్ సెర్చ్ చెయ్యాలి.
- నంబర్ దొరికాక... ఓపెన్ చేసి... HELP అని టైప్ చేసి... సెండ్ చెయ్యాలి.
- వెంటనే మీకు ఓ మెసేజ్ వస్తుంది. అది ఇలా ఉంటుంది "Please send any of the below keywords to get help. SUBSUDY/QUOTA/LPGID/BOOK
- BOOK అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలు మీకు వాట్సాప్ రిప్లై రూపంలో వస్తాయి. అవి కరెక్టే అయితే... Y అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. వెంటనే బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతూ మెసేజ్ వస్తుంది. అందులో రిఫరల్ నంబర్, డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ వస్తాయి. అంతే.
SUBSIDY అని టైప్ చేసి... సెండ్ చెయ్యాలి. మీ వివరాలు ఇలా కనిపిస్తాయి.
1: Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
2: Refill subsidy sent on:2019-12-07 to your account 6XXXXX523 Bank: AXIS BANK
3: Refill subsidy sent on:2019-11-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
4: Refill subsidy sent on:2019-09-27 to your account 6XXXXX523 Bank: AXIS BANK
5: Refill subsidy sent on:2019-08-31 to your account 6XXXXX523 Bank: AXIS BANK
6: Refill subsidy sent on:2019-07-28 to your account 6XXXXX523 Bank: AXIS BANK
QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
- మీకు ఓ మెసేజ్ వస్తుంది. మీరు 4/12 సబ్సిడీ సిలిండర్లు వాడారు అని చెబుతారు. అంటే నాలుగు వాడారు. మరో 8 వాడుకోవచ్చు.
LPG వినియోగదారు 17 నంబర్లను తెలుసుకోవడానికి LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. లేదా www.mylpg.in లో వివరాలు ఇచ్చి... ఐడీ పొందొచ్చు.
COMMENTS