Forensic Science: Opportunity to get jobs in Forensic Science Laboratory.
Forensic Science: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు పొందే అవకాశం.
న్యూఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ.. ఒప్పంద ప్రాతిపదికన 87 జూనియర్ ఫోరెన్సిక్/అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బాలిస్టిక్, కంప్యూటర్ ఫోరెన్సిక్ డివిజన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫొటో, సైబర్ ఫోరెన్సిక్ డివిజన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిజిక్స్/మ్యాథమెటిక్స్/ఫోరెన్సిక్ సైన్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/జువాలజీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, బీఎస్సీ, కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి.
అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 27 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు కింది ఈమెయిల్ అడ్రస్‌కు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధులకు అక్టోబర్ 31, 2022వ తేదీన ఉదయం 10 గంటలకు కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు రూ.35,190ల నుంచి రూ.77,418 జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
జూనియర్ ఫోరెన్సిక్/అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ పోస్టులు: 20
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 48
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 19
ఈమెయిల్ ఐడీ: dirfsl.delhi@gov.in
అడ్రస్:
Forensic Science Laboratory, Sector-14, Rohini, New Delhi-110085.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS