e-PAN Card Download: Forgot PAN Card? Downloading e-PAN is easy
e-PAN Card Download: పాన్ కార్డు మర్చిపోయారా? ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయడం ఈజీ.
మీకు ఫిజికల్ పాన్ కార్డు రావడం కన్నా ముందే ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇప్పటికే పాన్ కార్డు ఉంటే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే రూ.8.26 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. పాన్ కార్డ్ హోల్డర్ల సౌకర్యం, సౌలభ్యం కోసం ఆదాయపు పన్ను శాఖ ఎలక్ట్రానిక్ పాన్ లేదా ఇ-పాన్ డౌన్‌లోడ్ చేసుకునే సర్వీస్ ప్రారంభించింది.
పాన్ కార్డు లాగానే ఇ-పాన్ కూడా ప్రూఫ్‌గా వాడుకోవచ్చు. ఇ-పాన్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో పాన్ కార్డ్ హోల్డర్ల డెమొగ్రఫిక్ డీటైల్స్ అంటే పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్ లాంటివి ఉంటాయి. క్యూఆర్ కోడ్ రీడర్ ద్వారా ఈ వివరాలు యాక్సెస్ చేయొచ్చు
మొబైల్ నెంబర్ లింక్ చేసిన ఆధార్ నెంబర్ ఉన్నవారు సులువుగా ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సర్వీస్ ఉచితం. ఆదాయపు పన్ను శాఖ డిజిటల్ సంతకంతో ఇ-పాన్ జారీ చేస్తుంది. మరి ఇ-పాన్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/MPanLogin.html వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ ఎక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి validate పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇ-పాన్ కార్డును పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే https://www.onlineservices.nsdl.com/paam/ReprintDownloadEPan.html వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి validate పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేసి ఇ-పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
COMMENTS