Do you know whose lady's voice we hear in Google Maps navigation? Interesting things about her!
గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌లో మనకు వినిపించే లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా.? ఆమె గురించి ఆసక్తికర విషయాలివే.!
నిత్యం మనం స్మార్ట్‌ఫోన్లలో అనేక యాప్స్ వాడుతాం. వాటిలో గూగుల్ మ్యాప్స్ యాప్ కూడా ఒకటి. ఒకప్పుడంటే మనకు తెలియని ఏదైనా ప్రాంతానికి వెళితే దారిలో కనబడిన వారందరినీ అడ్రస్ అడుగుతూ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. చేతిలో ఓ స్మార్ట్ ఫోన్, అందులో గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు. మనం ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఏదైనా అడ్రస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ షేర్ చేసిన మ్యాప్ లొకేషన్‌కు కూడా నేరుగా చేరుకోవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్‌లో మనకు లభిస్తున్న ముఖ్యమైన ఫీచర్.. నావిగేషన్.. అందులో మనం ఏదైనా మార్గంలో వెళ్లాలనుకుంటే నావిగేషన్ ఆన్ చేస్తే చాలు. మనకు ఓ లేడీ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఫలానా మార్గంలో వెళ్లమని, ఫలానా స్టాప్ వద్ద మలుపు తిరగమని, ఆగమని చెబుతూ డైరెక్షన్స్ ఇస్తుంది. అయితే ఆ లేడీ వాయిస్ ఎవరిదో తెలుసా..?
గూగుల్ మ్యాప్స్‌లోని నావిగేషన్‌లో మనకు వినిపించే ఆ లేడీ వాయిస్ ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళది. ఆమె పేరు కారెన్ జాకబ్‌సన్. కారెన్‌ది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్. ఈమె న్యూయార్క్‌లో ఉంటోంది. ఆమె మంచి సింగరే కాదు, మోటివేషన్ కలిగించే ప్రసంగాలను ఇస్తుంటుంది. జనాలను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, సాంగ్ రైటర్‌గా అనేక రంగాల్లో ఈమెకు ప్రవేశం ఉంది.
అలా కారెన్ వాయిస్ చక్కగా సెట్ అవుతుందని భావించడంతో గూగుల్ సంస్థ ఆమె వాయిస్‌ను గూగుల్ మ్యాప్స్‌లోని నావిగేషన్‌లో ఏర్పాటు చేసింది. కనుకనే మనం గూగుల్ మ్యాప్స్‌లో నావిగేషన్ ఫీచర్‌ను వాడుకుంటున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో కారెన్ వాయిస్ మనకు వినిపిస్తుంది. మనం వెళ్లాలనుకున్న మార్గం గురించి డైరెక్షన్లు ఇస్తుంటుంది. ఇక కారెన్ తన వాయిస్‌ను గూగుల్ మ్యాప్స్‌కు ఇవ్వడంతో ఇప్పుడందరూ ఆమెను జీపీఎస్ గర్ల్ అని కూడా పిలుస్తున్నారు. జీపీఎస్ గర్ల్ అంటే ఆస్ట్రేలియాలోనే కాదు, అటు అమెరికాలోనూ అందరికీ కారెన్ జాకబ్‌సన్ గుర్తుకు వస్తుంది. ఏది ఏమైనా ఆమె వాయిస్ మాత్రం చాలా బాగుంటుంది కదా..!
COMMENTS