Delhi University Recruitment 2022
నెలకు రూ.1,80,000ల జీతంతో ఢిల్లీ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు.
భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజ్.. 101 టీచింగ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
బయోకెమిస్ట్రీ, బోటనీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఎన్విరాన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సంస్కృతం, సోషియాలజీ, జువాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్స్ డిగ్రీ/ఎంఫీల్/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
యూజీసీ నెట్/సీఎస్ఐఆర్ నెట్లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.57,700ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
బయోకెమిస్ట్రీ: 3
బోటనీ: 5
కెమిస్ట్రీ: 10
కామర్స్: 12
కంప్యూటర్ సైన్స్: 4
ఎకనామిక్స్: 5
ఇంగ్లీష్: 4
ఎన్విరాన్మెంటల్ సైన్స్: 2
జాగ్రఫీ: 5
హిందీ: 7
హిస్టరీ: 4
మ్యాథమెటిక్స్: 6
ఫిజికల్ ఎడ్యుకేషన్: 1
ఫిజిక్స్: 12
పొలిటికల్ సైన్స్: 10
సంస్కృతం: 2
సోషియాలజీ: 1
జువాలజీ: 8
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS