CSIR-AMPRI Recruitment 2022
బీటెక్/బీఎస్సీ అర్హతతో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ..
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎంపీఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన 11 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సీఎస్‌ఈ/ఎలక్ట్రానిక్స్/మెటలర్జీ/మెటీరియల్ సర్వీసెస్/సివిల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్/మెకాట్రోనిక్స్/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్, ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంజనీరింగ్/కెమిస్ట్రీ/ఫిజిక్స్/ స్సెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ, లైఫ్ సైన్సెస్‌లో బీఎస్సీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. అలాగే సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ లేదా గేట్‌లో వ్యాలిడ్ ర్యాంక్ సాధించి ఉండాలి.
అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 2, 2022వ తేదీన కింది అడ్రరస్‌లో నిర్వహించే ఇంటర్వూకు నేరుగా హాజరుకావచ్చు.
షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంతోపాటు, ఇతర అలెన్సులు కూడా చెల్లిస్తారు.
ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
అడ్రస్:
CSIR-AMPRI, Bhopal.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS