BHEL Recruitment 2022
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగాప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్ (14), ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ (16) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటను సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 01-11-2022 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆస్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఎంపికైన ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ. 78,000, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్లకు రూ.43,550 జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 25-10-2022న మొదలై 15-11-2022 తేదీతో ముగియనుంది.
* దరఖాస్తుల హార్డ్ కాపీని 18-11-2022 తేదీలోపు పంపించాలి.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
FOR ONLINE APPLY CLICKHERE
COMMENTS