BECIL Recruitment 2022
ఐకాట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. గుర్గావ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అసిస్టెంట్ మేనేజర్ (01), సీనియర్ ఎగ్జిక్యూటివ్ (01), ఎగ్జిక్యూటివ్ (03), జీఈటీ (02), సీనియర్ టీఏ (01), జూనియర్ రిసెర్చ్ ఫెలో (01), ఇంజినీర్ (14), సీనియర్ టీఏ (02), టెక్నికల్ అసిస్టెంట్ (03), ట్రేడ్స్‌మెన్ (02), ఎస్‌టీఏ అసోసియేట్ (01), మేనేజ్‌మెంట్ ట్రైనీ (02), సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (03), జీఈటీ (02), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (03), డేటా ఎంట్రీ ఆపరేటర్ (02), డ్రైవర్ (02), ప్లంబర్ (01), అడ్వైజర్ (01), టెస్ట్ డ్రైవర్ (01), అసిస్టెంట్ మేనేజర్ (01), డీఈటీ (01) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఐటీఐ, 12వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 08-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS