BCCL Recruitment 2022
భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్‌లో మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని భారత్ కొకింగ్ కోల్ లిమిటెడ్.. 41 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సర్జన్, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రీషియన్, సైకియాట్రిక్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మనాలజిస్ట్/చెస్ట్ స్పెషలిస్ట్, ఆప్తల్మాలజిస్ట్, ఈఎన్టీ, రేడియాలజిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, డీఎన్‌బీ, పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
అభ్యర్ధుల వయసు ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి 35 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 27, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్‌లో సాధించిన మెరిట్ మార్కుల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
సీనియర్ మెడికల్ స్పెషలిస్టు (E4)/ మెడికల్ స్పెషలిస్టు (E3) పోస్టులు: 28
సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టులు: 13
అడ్రస్:
The General Manager (Personnel/EE),
Bharat Coking Coal Limited at Executive Establishment,
Koyla Bhawan, Post: Koyla Nagar,
BCCL Township, Dist Dhanbad, Jharkhand- 826005.
FOR NOTIFICATION CLICKHERE
FOR FULL INFORMATION CLICKHERE
COMMENTS