1061 JTO, Stenographer Vacancies in DRDO
DRDO లో 1061 JTO, స్టెనోగ్రాఫర్ ఖాళీలు
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) జూనియర్ ట్రన్స్‌లేషన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండ్ గ్రూప్ బి,సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ క్యాపబులిటీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19,000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 1061
పోస్టుల వివరాలు:
జూనియర్ ట్నాన్స్‌లేటర్ ఆఫీసర్ - 33
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 (ఇంగ్లీష్, టైపింగ్)- 215
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 (ఇంగ్లిష్ టైపింగ్) - 123
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ (ఇంగ్లిష్ టైపింగ్) -250
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎ (హిందీ టైపింగ్) -12
స్టోర్ అసిస్టెంట్ ఎ (ఇంగ్లిష్ టైపింగ్)-134
స్టోర్ అసిస్టెంట్ ఎ (హిందీ టైపింగ్) -4
సెక్యూరిటీ అసిస్టెంట్ ఎ - 41
వెహికల్ ఆపరేటర్ ఎ - 145
ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఎ - 18
ఫైర్ మ్యాన్ - 86
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, డిగ్రీ/పీజీ (సంబంధిత సబ్జెక్టులు)
వయసు: డిసెంబర్ 7, 2022 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
జేటీఓ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 పోస్టులకు గరిష్ట వయసు 30 ఏళ్లు.
నిబంధనలను అనుసరించి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 7, 2022.
చివరి తేదీ: డిసెంబర్ 7, 2022.
COMMENTS