You can obtain 12 tickets instead of 6 tickets by linking your Aadhaar to the IRCTC.
IRCTC-Aadhaar Link: ఐఆర్సీటీసీతో ఆధార్ లింక్ చేస్తే లాభమిదే...
IRCTC-Aadhaar Link: ఐఆర్సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్సైట్తో పాటు ఐఆర్సీటీసీ యాప్లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోలేరు.
మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? రైల్వే టికెట్ల రిజర్వేషన్ చేయిస్తుంటారా? మరి మీ ఆధార్ నెంబర్ను ఐఆర్సీటీసీ అకౌంట్తో లింక్ చేశారా? బ్యాంకులు, పాన్ కార్డులకు మాత్రమే కాదు... ఐఆర్సీటీసీ అకౌంట్తోనూ ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.
ఐఆర్సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్సైట్తో పాటు ఐఆర్సీటీసీ యాప్లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
అంతకన్నా ఎక్కువ బుక్ చేసుకోలేరు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ ఓ అవకాశం కల్పిస్తోంది. ఐఆర్సీటీసీ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే 12 రైలు టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్సీటీసీ అకౌంట్తో ఆధార్ లింక్ చేయండి ఇలా...
- ఐఆర్సీటీసీ వెబ్సైట్ www.irctc.co.in ఓపెన్ చేయండి.
- ఐఆర్సీటీసీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
- My Account’ ట్యాబ్లో ‘Link Your Aadhaar’ పైన క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీతో పాటు ఆధార్ కార్డుపైన ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.
- Send OTP’ బటన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఎంటర్ చేసి ‘Verify OTP’ పైన క్లిక్ చేయాలి.
- చివరగా ‘Update’ పైన క్లిక్ చేస్తే ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
మీ ఐఆర్సీటీసీ అకౌంట్ను ఆధార్తో లింక్ చేస్తే ఒక నెలలో మీరు 12 రైలు టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే 6 టికెట్ల వరకు మాత్రమే అనుమతి ఇస్తుంది ఐఆర్సీటీసీ.
COMMENTS