Whatsapp: Do you know how to chat on WhatsApp while remaining anonymous?
Whatsapp: వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నట్టు తెలియకుండా చాటింగ్ చేయడం ఎలానో తెలుసుకుందాం.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ గురించి మనందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని లక్షలాదిమంది ఈ యాప్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ సాయంత్రం పడుకునే వరకు కూడా ఈ వాట్సాప్ లో చాటింగ్ చేస్తూనే ఉంటారు.
అయితే చాలామంది అవతలి వ్యక్తి వారితో చాటింగ్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఆన్లైన్లో ఉన్నట్టుగా తెలియకుండా జాగ్రత్తపడాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే వినియోగదారులు కోరుకుంటున్నా విధంగానే ఈ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ సంస్థ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానుంది.
వాట్సాప్ లో ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇతరులకు తెలియకుండా ఆన్లైన్ లో ఉన్న విషయాన్ని ప్రైవేట్ గా ఉంచుకోవాలి అనుకున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అయితే ఇందుకోసం వాట్సాప్ సంస్థ వారు సరికొత్త ఫీచర్ ని తీసుకువస్తున్నారు. మన లాస్ట్ సీన్ అవతల వ్యక్తికి కనిపించకుండా ఆప్షన్ ని ఆఫ్ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం వాట్సాప్ ఓపెన్ చేసి చివర్లో కనిపించే ఆ డాట్లు క్లిక్ చేయాలి. అక్కడి నుంచి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అందులో అకౌంట్ ను క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. లాస్ట్ సీన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, అక్కడ మై కాంటాక్ట్స్, నో బడీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి. అయితే అందులో కాంటాక్ట్స్ అని ఉంటే కేవలం మీ మొబైల్ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి మాత్రమే మీ లాస్ట్ సీన్ చూపిస్తుంది. లాస్ట్ సీన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ లాస్ట్ సీన్ ఎవరికి కనిపించదు. కానీ అవతలి వ్యక్తి, మీరు ఒకేసారి ఆన్లైన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు ఆన్లైన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది.
COMMENTS