UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023
ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే.. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసెస్లో 327 ఖాళీలను పూర్తి చేయనున్నారు.
జాతీయ స్థాయిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ లాంటి గ్రూప్-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ విభాగాల్లో ఏటా యూపీఎస్సీ ఈఎస్ఈ నిర్వహిస్తుంది. తుది ఎంపిక తర్వాత సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్, సెంట్రల్ పవర్, నేవల్, బార్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, సర్వే ఆఫ్ ఇండియా సర్వీసెస్, ఇండియన్ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్, జూనియర్ టెలికాం ఆఫీసర్, ఆల్ ఇండియా రేడియో రెగ్యులేటర్ సర్వీసెస్ లాంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.
దేశంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేసే మంచి అవకాశం దక్కుతుంది. పదోన్నతులతో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం. వీటితోపాటు 7వ పే కమిషన్ లెవెల్ 10 మూలవేతనం రూ.50,100తో మొదటి నెల నుంచే సమారు రూ.90 వేల వరకు పొందగలుగుతారు.
ఆన్లైన్లో www.upsconline.nic.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ అడ్మిషన్ కార్డ్ను పరీక్షకు మూడు వారాల ముందు జారీ చేస్తారు. దీన్ని యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
పరీక్ష రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు పరీక్ష రుసుము చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14 అక్టోబరు, 2022 సాయంత్రం 6.00 గంటల వరకు.
విద్యార్హతలు: ఇంజినీరింగ్ లో ఏదైనా డిగ్రీ/ తత్సమాన అర్హత. ఎంఎస్సీ/ తత్సమానం. కానీ ప్రతిపాదించిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.
వయః పరిమితి: జనవరి 1, 2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ స్టేజ్-1 పరీక్ష తేదీ: 19 ఫిబ్రవరి, 2023
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు (ప్రిలిమ్స్, మెయిన్స్): హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి
పూర్తి ఆబ్జెక్టివ్ విధానం. కాలిక్యులేర్లను అనుమతించరు.
UPSC IES 2023 Selection Stages:
- Prelims Written Exam (500 Marks)
- Mains Written Exam (600 Marks)
- Interview (200 Marks)
- Document Verification
- Medical Examination
UPSC Engineering Services 2023 Important Links:
UPSC IES 2023 Notification PDF Click Here
COMMENTS