Recharge plans: Why monthly recharge validity is only 28 days?
Recharge plans: మంత్లీ రీఛార్జ్ వ్యాలిడిటీ 28 రోజులే ఎందుకు? ఈ డౌట్ మీకూ వచ్చే ఉంటుంది.. అసలు కారణం
సెల్‌ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు(recharge plans) ఎంత పెరిగినా రీఛార్జ్ చేయించుకోవడం తప్పదు. సెల్‌ఫోన్ లేకుంటే ఏ పనులూ జరగవు కాబట్టి వినియోగదారులు వెనుకాడకుండా రీఛార్చ్ చేసుకుంటారు. అయితే నెలవారీ(monthly) ప్లాన్ గడువు(వ్యాలిడిటీ) 28 రోజులు మాత్రమే ఎందుకుంటుంది? అనే అంశం వినియోగదారులకు ఎప్పటికీ సందేహమే. నెల మొత్తం 30 లేదా 30 రోజులు ఎందుకు వ్యాలిడిటీ ఇవ్వరు? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ 28 రోజుల వ్యాలిడిటీ కారణంగా వినియోగదారులు ఒక సంవత్సరంలో 12 నెలలే ఉంటే 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీ ప్రకారం సంవత్సరంలో 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే 336 రోజులే కవర్ అవుతుంది. అంటే ఏడాదిలో ఇంకో 29 రోజులు మిగిలే ఉంటున్నాయి. అందుకే వినియోగదారులు అదనంగా మరోసారి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా టెలికం కంపెనీలు ఒక నెల అదనపు ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ అధిక ఆదాయం కోసమే కంపెనీలు 28 రోజుల వ్యూహాన్ని కొనసాగిస్తున్నాయి.
అయితే వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై రంగంలోకి దిగిన టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇదివరకే కీలక నిర్ణయం తీసుకుంది. నెల మొత్తం వ్యాలిడిటీ ఇవ్వాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. నెలలో 30 లేదా 31 రోజులకు సరిపడా వ్యాలిడిటీ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తదనుగుణంగా రిలయన్స్ జియో ఇప్పటికే రూ.259 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకుంది. ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు కూడా ప్లాన్స్ ప్రవేశపెట్టాయి.
అదనపు ఆదాయం ఏ రేంజ్‌లో ఉందో తెలుసా..28 రోజుల వ్యాలిడిటీతో టెలికం కంపెనీలు భారీ మొత్తంలో అదనపు ఆదాయాన్ని పొందుతున్నాయి. ఎంతలా అంటే.. జులై 2022న నాటికి ఎయిర్‌టెల్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 35.48 కోట్లుగా ఉంది. ఈ యూజర్లు నెలవారీ 28 రోజుల ప్లాన్ రూ.179 రీఛార్జ్ చేయించుకుంటే ఆ కంపెనీకి అదనపు ఆదాయం రూ.6,350 కోట్లు వస్తుంది. ఇక రిలయన్స్ జియోకి 40.8 కోట్ల సబ్‌స్ర్కైబర్లు ఉండగా.. 28 రోజుల అదనపు రీఛార్జ్ కంపెనీకి ఏకంగా రూ.8,527 కోట్లు ఆర్జిస్తోంది. 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న రీఛార్జ్‌లు చేయించుకున్నా ఇదే పరిస్థితి. 4 సార్లు రీఛార్జ్ చేసుకుంటే 336 రోజులు పూర్తవుతుంది.
28 రోజుల ప్లాన్ కంటే తక్కువ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ గడువు మరింత తగ్గుంది. ఇందుకు సంబంధించి రిలయన్స్ జియో (reliance jio), ఎయిర్‌టెల్(airtel), వీఐ(vodafone india) వేర్వేరు ప్లాన్లు ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. 28 రోజుల వ్యాలిడిటీతో జియో ఆఫర్ చేస్తున్న రూ.209, రూ.299, రూ.419తోపాటు మరికొన్ని ప్లాన్లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ప్లాన్లలో రూ.179, రూ.265, రూ.299, రూ.359, రూ.399, రూ.449తోపాటు మరిన్ని ప్లాన్స్ ఉన్నాయి. వీ ప్లాన్లలో రూ.299, రూ.399, రూ.499, రూ.601తోపాటు పలు ప్లాన్స్ ఉన్నాయి.
COMMENTS