ప్రపంచ గుడ్డు దినోత్సవం
పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎదిగే పొల్లలకు చాలినన్ని పొతీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు .
గుడ్ల వాడకాన్నీ, దానిలొని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తం గా గల ప్రజలకు తెలియజెప్తూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారము నాడు " వరర్డ్ ఎగ్ డే " నిర్వహించడం జరుగుతుంది.
ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ 1996 లో వరల్డ్ ఎగ్ డే ని ప్రకటించినది. కొన్ని దేశాలలో ఎగ్ ఫెస్టివల్ ను జరుపుతారు . ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ ప్రపంచము లో గల ప్రజల మధ్య అనుసంధానము ఏర్పరిచే ... ప్రపంచగుడ్లపరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ. విభిన్న సంస్కృతులు , జాతీయతల నడుమ సంబందాలు అభివృద్ధిపరిచే సమాచారము తెలియజెప్పే అసాధారణ కమ్యూనిటి ఇది. ఐఇసి గుడ్ల ఉత్పత్తి పోషకాలు , మార్కెటింగ్ లకు సంబంధించిన తాజా పరిణామాల్ని పర్యవేక్ష్క్షింస్తూంటుంది. 1996 లో వియన్నా లో జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ సదస్సు లో అక్టోబర్ రెండో శుక్రవారము నాడు " వరర్డ్ ఎగ్ డే" నిర్వహించాలని ప్రకటించారు .
మన దేశము లో గుడ్డు వాడకం అధికమే . గుడ్డును పలు రూపాలలో ఆహారముగా తీసుకుంటారు .
- పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడము.
- గుడ్డును ఉడికించి తినడం.
- ఉడికించిన గుడ్డు బ్రెడ్ ని కలిపి టోస్ట్ గా తీసుకుంటారు.
- గుడ్డును పలావు లో, బిర్యానిలో రుచికోసము వాడుతారు.
- బేకరీ లలో గుడ్డును వాడుతారు.
- గుడ్డు ఆమ్లెట్ , బుల్స్ ఐ , ఎగ్ ఫ్రై ... కూరగా వాడుతారు.
ఏ ఒక్క వయసు కో ప్రిమితమైన ఆహారము కాదు గుడ్డు . బాల్యము నుండి వృద్దాప్యము వరకు అన్ని వయసులలో స్త్రీ పురుషులు బేదములేకుండా గుడ్డును తీసుకుంటారు . గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. గుడ్డు ను తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కిచెబుతున్నారు. ఉదయము అల్పాహారముతో గుడ్డు తీసుకోవడము మంచిదని తజా అధ్యయనములో తేలినది . గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీరం లొ ప్రతి అవయవము మీద ప్రభావము చూపుతుంది .
గుడ్డును శాకాహారము గా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమము ఇటీవలి కాలం లో ఊపందుకుంది.
గుడ్డు ద్వారా : మనకందే పోషకాలు -
క్యాలరీలు : 70-80 ,
ప్రోటీన్లు : 06 గ్రాములు ,
క్రొవ్వులు : 05 గ్రాములు ,
కొలెస్టిరాల్ : 190 గ్రాములు
నీరు : 87%.
ఉపయోగాలు :
మంచి చేసేవి ->
గుడ్డు పౌస్టికాహారము .. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి ,
పిల్లల పెరుగుదలకు మంచిది . ,
కూర గా వాడుకోవచ్చును .
కోడి గుడ్డు తింటే దృస్టికి ఎంతో మేలు కలుగుతుంది ... రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశము బాగా తగ్గుతుంది ,
గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది,కాబట్టి డైటింగ్ లో ఉన్నవారు గుడ్డు ను తీసుకోవచ్చు ,
బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. గుడ్డులో ఉన్న నాణ్యమైన ప్రోటీల్న వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారము తీసుకోనివ్వదు ... పరిమిత ఆహారము తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు .
గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనము వల్ల తేలినది. వాస్తవం లో గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోవటం లేదా గుడెజబ్బులు రావటం బగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.
మెదడుకు ఆరోగ్యాన్నిచ్చేపదార్దాలు గుడ్డులో ఉన్నాయి . గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు " కోలిన్ " అనే పోషక పదార్ధము ఉంది ... ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుంది సంకేతాలు వేగంగా చేరవేయడం లో కూడా కోలిన్ ప్రాత్ర వహిస్తుసంది .
గుడ్డు లో ఉన్న ఐరన్ ను శరీరము చాలా సులభం గా గ్రహిస్తుంది. అలా గ్రహించే రూపము లో ఐరన్ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది .
గుడ్డు ను ఆహారము గా తీసుకోవటానికి, కొలెస్టరాల్ కి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సు లో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టిరాల్ పెరుగుతుందని తేలింది .
స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డు కి ఉందని తేలినది . ఒక అద్యయనము లొ వారములో 6 రోజులు గుడ్డ్ను ఆహారము గా స్త్రీలకు ఇచ్చారు .. అటువంటి వార్లో రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశము 44 శాతము తగ్గినట్లు తేలినది.
గుడ్డు వలన శిరోజాల ఆరోగ్యము మెరుగవుతుంది. గుడ్డులొ ఉన్న సల్ఫర్ , పలురకాల విటమిన్లు , లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది , .
గుడ్డు లో పలు రకాల లవణాలు , అరుదైన లవణాలతో పాటు ఫాసపరస్ , అయోడిన్ , సెలీనియం , ఐరన్ , జింక్ లు ఉన్నాయి ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే .
గుడ్డు లోని ప్రోటీన్ల వల్ల యవ్వనములోని కండరాలకు బలము , చక్కని రూపము యేర్పడుతుంది .
నష్టము చేసేవి -
గుడ్డును బాగా ఉడికించి అందులోని బాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి . బాక్టీరియా వల్ల శరీరానికి నష్టం జరుగుతుంది ,
పచ్చి గుడ్దు తినడం మంచిదికాదు . తెల్లసొనలో " ఎవిడిన్ " అనే గ్లైకో పోటీన్ ఉన్నందున అది బి విటమిన్ ను శరీరానికి అందనీయకుండా చేస్తుంది .
కొలెస్టిరాల్ జబ్బులతో బాధపడుతున్నవారు గుడ్డును తీసుకొరాదు .
టైప్ 2 డయాబిటీస్ ఉన్నవారిలో గుడ్డు ను వాడరాదు . రిస్క్ ను ఎక్కువ చేస్తుందని రిపోర్తులున్నాయి .
కొంతమందిలో ఫుడ్ ఎలర్జీ కలిగే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని అద్యయనాలు ఉన్నాయి .
కొన్ని యాంటిబయోటిక్స్ మందులు ఉదా. సెఫలొస్పోరిన్స్ ... గుడ్డు వాడేవారిలో పనిచేయక పోవచ్చును.
గుడ్డు కంపు ను భరించలేము ... హిందూ బ్రహ్మిణ్లు ఇబ్బంది పడుదురు .
COMMENTS