United Nations Organization Day
ఈ రోజు (అక్టోబరు 24 ) ఐక్యరాజ్య సమితి,United nations Organization గురించి తెలుసుకుందాము
అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. . ఐక్యరాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.
ఐక్యరాజ్య సమితికి 79 ఏండ్లు
(United Nations) ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతను పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు ఐక్యంగా 1945 లో సరిగ్గా ఇదే రోజున ఐక్యరాజ్యసమితిని ప్రారంభించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థ స్థాపితమైంది. దేశాల మధ్య సరిహద్దు వివాదం నుంచి అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన ఏదైనా సమస్య వరకు, ప్రతి సమస్యకు పరిష్కారం ఐక్యరాజ్యసమితి (యూఎన్) వద్ద దొరుకుతుంది. 1945 అక్టోబర్ 24 న ఏర్పడిన యూఎన్.. ఇవ్వాల్టితో 79 ఏండ్లు పూర్తి చేసుకున్నది.
నిజానికి, 1910-1950 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భయంకరమైన విషాదాన్ని ప్రపంచం చవి చూసింది. వేలాది మంది మరణించారు. దేశాలు భారీ ఆర్థిక నష్టాలకు గురయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు, అంతర్జాతీయ శాంతి, భద్రత పెద్ద సమస్యగా తయారైంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. 1945 లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సంస్థ సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు కొనసాగిని ఈ సదస్సులో 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం చివరి రోజున ఒక చార్టర్‌పై అన్ని దేశాలు సంతకం చేయగా.. ఈ చార్టర్ 24 అక్టోబర్ 1945 నుంచి అమలులోకి వచ్చింది. అనంతర కాలంలో ఈ సంస్థను ఐక్యరాజ్యసమితిగా పరిణామం చెందింది. అందుకని, అక్టోబర్ 24 న ఐక్యరాజ్యసమితి స్థాపక దినోత్సవం జరుపుకుంటాం.
యూఎన్ ప్రధాన అంగాలు
జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యూఎన్ సెక్రటేరియట్. ఇవన్నీ 1945లో ఐక్యరాజ్యసమితితో కలిసి ఏర్పడ్డాయి. యూఎన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్నది. ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునెస్కో, యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు అనుబంధంగా ఉన్నాయి.
COMMENTS