NIAB Hyderabad Jobs 2022
బీఈ/బీటెక్ అర్హతతో.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో ఉద్యో్గాలు..
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్, ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి.
టైపింగ్ స్కిల్స్ అవసరం. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 25 నుంచి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 25, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్అభ్యర్ధులు రూ.200లు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది.
అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.
విద్యార్హతలు, అనుభవం, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అర్హత సాధించిన వారికి 7వ పే స్కేల్ ఆధారంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
అడ్రస్:
The Director,
National Institute of Animal Biotechnology, Sy.No. 37,
Opp. Journalist Colony,
Extended Q City Road,
Gowlidoddi,
Gachibowli,
Hyderabad, Telangana, India 500 032.
For Notification ClickHere
For Apply Online Clickhere
Official Website Click here
COMMENTS