Zoonosis Day
పెంపుడు జంతువు కనబరిచే విశ్వాసం దాని పట్ల మనం ఏర్పర్చుకొనే ఆత్మీయత మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. మనిషి,జంతువు మధ్య ఇలాంటి బంధం ఏర్పడితే అది కలకాలం కొనసాగుతుంది. ఈ బంధం వెనుక ప్రాణాలను హరించే అంటురోగాల ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రేమను పెంచుకోవడం ఎంత అవసరమో అందుకు తగ్గ జాగ్రత్తలు కూడా అంతే అవసరం. . . ఆప్యాయతలోనూ అప్రమత్తత! పెంపుడుజంతువుల పెంపకంలో జాగ్రత్తలు...... అవసరం .
జూనోసిస్ అంటే..
జూనోటిక్ అనే ఇటాలియన్ పదం నుంచి పుట్టిందే జూనోసిస్. 'జూ' అంటే జంతువులకు సంబంధించిన అంశం. మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్నే జూనోటిక్ వ్యాధులంటారు. ఇలాంటి వాటిని ఇప్పటి వరకు 253 వరకు గుర్తించారు.
వీటిలో 'ర్యాబిస్' (పిచ్చికుక్క ప్యాధి) అనేది అత్యoత ప్రాణాంతకరమైన వ్యాధి. లూయిస్పాశ్చర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి జూలై ఆరు 1885 వ సంవత్సరంలో మొట్ట మొదటిసారిగా యాంటీర్యాబిస్ టీకాను వేసి సఫలీకృతులయ్యారు. ఆ రోజును అంటే జూలై ఆరో తేదీని ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం 'వరల్డ్ జూనోసిస్ డే'గా నిర్వహిoచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జూనెటిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తత చేసి, రోగాల బారిన పడకుండా చేయటమే వరల్డ్ జూనోసిస్ డే ప్రధానోద్దేశ్యము . జంతువులు, పక్షులకు సంబందించిన కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమించి సాధారణ సమస్యలతోపాటు ప్రాణహాని కలిగేంతటి వ్రమాద పరిస్థితులెదురవుతున్నాయి. ఈ కారణoగా జoతువులు, కోళ్లు, పక్షులను పెంచేపారు, ప్రయోగశాలలు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పనిచేసే్వారు,పశువుల ఆస్పత్రుల సిబ్బంది, చర్మము , తోళ్ల పరిశ్రమల కార్మికులు ఈ జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఆంత్రాక్స్:
జూనోటిక్ వ్యాధుల్లో , ఆంత్రాక్స్ ప్రాణాంతకమైనవి. ఈవ్యాధి పచ్చగడ్డి ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. గాలి ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది.
వ్యాధి నివారించాలంటే
* ఆంత్రాక్స్ వ్యాధి గుర్తించిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఐదేళ్లపాటు నిర్ణీతగడువులో వ్యాధినిరోధకటీకాలు చేయించాలి.
* మనుషుల్లో వ్యాధి సోకినట్లు అనిపిస్తే పరీక్షలు చేయించి అత్యవసర చికిత్స అందించాలి.
రాబిస్ :
మూగజీవాలద్వారా మనుషులకు సోకే ప్రాణాంతకమైన వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రాబిస్. తోడేళ్లు, నక్కలు, ముంగిసల్లో ఈవ్యాధికారక క్రిములు ఎప్పుడూ ఉంటాయి.
జంతువుల నుంచి, పక్షుల నుంచి సోకే మరికొన్ని వ్యాధులు ->
వైరస్ ద్వారా వ్యాపించేవి:
- ర్యాబిస్,
- మెదడువాపు ,
- మ్యాడ్కౌ,
- గాలికుంటు వ్యాధి.
బ్యాక్టీరియా వల్ల వ్యాపించేవి :
- బ్రూసెల్లోసిస్,
- క్షయ,
- సాల్మొనెల్లోసిస్,
- ఆంత్రాక్స్,
- గ్లాండర్స్.
పరాన్నజీవుల వల్ల వచ్చేవి:
- ఏంకైలో స్టోమియాసిస్,
- హైడాటియోసిస్,
- అలర్జీ,
- ఎగ్జిమా (గజ్జి),
- అమీబియాసిస్,
- బాలంటీడియోసిస్,
- టాక్సోప్లాస్మా.
వ్యాధులు రాకుండా...
- పూర్తిగా ఉడికిన మాంసాన్ని, గుడ్లను మాత్రమే తినాలి.
- వ్యాధి సోకిన పశువుల పాలను తాగకూడదు. అనుమానo ఉన్నవ్పుడు పాలను బాగా మరిగించి తాగాలి.
- పశువులు, జoతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణరగా ఇవ్వవలసిన వ్యాధి నిరోధక టీకాలను చేయిoచాలి.
- పెంపుడు కుక్కలకు తప్పక టీకాలు వేయించాలి.
- పందులకు గ్రామ శివార్లలో ఆవాసo ఏర్పాటు చేయాలి.
- మృత జంతు కళేబరాలను లోతైన గోతిలో సున్నం చల్లి పూడ్చిపెట్టాలి.
- జంతు ఆవాసాలను అప్పుడప్పుడు క్రిమిసంహారాలతో శుభ్రము చేయాలి
పాటించాల్సిన జాగ్రత్తలివీ..
- వీధి కుక్కల నిర్మూలన,
- ఊరికి దూరంగా 3, 4 కిలోమీటర్ల దూరంలో పరిశుభ్రమైన వాతావరణంలో పందులు పెంచాలి.
- పశుపెంపకం దారులు పాలఉత్పత్తిలో పరిశుభ్రత పాటించాలి.
- పెంపుడు కుక్కలకు తప్పక రాబిస్ నిరోధక టీకాలు వేయించాలి.
- చిన్నపిల్లలు కుక్కలతో ఆడేటపుడు నోట్లో చేతులు పెట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
COMMENTS