Jobs In BARC: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. చివరి తేదీ 12 సెప్టెంబర్ గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్, నర్స్ అండ్ సబ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు BARC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు https://recruit.barc.gov.in/barcrecruit/. అలాగే.. ఈ లింక్ ద్వారా BARC రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDF ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిలో విద్యార్హత, జీతం తదితర వివరాలను పొందుపరిచారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 36 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 17 ఆగస్టు, 2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 12 సెప్టెంబర్, 2022
ఖాళీ వివరాలు
అర్హత ప్రమాణాలు..
1. నర్స్- ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి B.Sc నర్సింగ్ డిగ్రీ లేదా డిప్లొమా.
2. సైంటిఫిక్ అసిస్టెంట్- సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా.
3. సబ్ ఆఫీసర్ - సంబంధిత విభాగంలో 12 నుండి 15 సంవత్సరాల అనుభవంతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల దరఖాస్తు ఫీజు రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఈఎస్ఎమ్ వంటి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక ప్రక్రియ..
ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. అందులో మొదటిది రాతపరీక్ష. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారిని టైప్ టెస్టుకు పిలుస్తారు. దీనిలో కూడా అర్హత సాధిస్తే..డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు పిలుస్తారు. చివరగా.. మెడికల్ టెస్టు నిర్వహించి.. అపాయింట్ మెంట్ ఆర్డర్స్ జారీ చేస్తారు.
COMMENTS