How to get and repay educational loans
ఎడ్యుకేషన్ లోన్ ఎవరికి ఇస్తారు?ఎలా తీసుకోవాలి?తిరిగి ఎలా చెల్లించాలి?
AICTE, UGC, MHRD, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ గుర్తింపు ఉన్న ఇనిస్టిట్యూట్ లలో ప్రవేశం పొందిన విద్యార్థులకి మాత్రమే విద్యా ఋణం లభిస్తుంది.విద్యార్థులు అడ్మిన్ పొందిన విధానాన్ని కూడా బ్యాంక్ లు పరిగణనలోకి తీసుకుంటాయి.ఎంట్రన్స్ లలో ఉత్తీర్ణత సాధించి,మెరిట్ లిస్టులో ఉంటేనే రుణం మంజూరు చేస్తారు.మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందితే ఋణం ఇవ్వరు. ఒక్కోసారి బ్యాంక్ మేనేజర్ ఇష్టం
రుణం ఇచ్చే విధానం
మన దేశం లో ప్రవేశం పొందితే గరిష్టంగా 10 లక్షలు ఇస్తున్నారు విదేశీ ఇనిస్టిట్యూట్ లలో ప్రవేశం పొందితే గరిష్టంగా 20 లక్షలు మంజూరు చేస్తారు.రుణ మొత్తం ఆధారంగా కొన్ని హామీ పత్రాలు బ్యాంక్ లు తీసుకుంటున్నాయి
4 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు.4 లక్షల నుండి 7.5 లక్షల వరకు తల్లిదండ్రులు హామీ,థర్డ్ పార్టీ గ్యారంటీ ఇవ్వాలి.7.5 లక్షల కి మించిన ఋణానికి కొల్లేటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి.రుణ మొత్తం లో కొంత మార్జిన్ మనీ పేరుతో సొంతంగా సమకూర్చుకోవాలి
4 లక్షల ఋణం వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు.4 లక్షల పైన ఋణం తీసుకునే విద్యార్థులు స్వదేశంలో ఐతే 5%,విదేశాల్లో ఐతే 15% మార్జిన్ మనీని సమకూర్చుకోవాలి
కోర్సు పూర్తి అయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం లభించినప్పటి నుండి వాయిదాల విధానంలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలి గరిష్టంగా 15 ఏళ్ల వ్యవధిలో ఈఎంఐ విధానం లో చెల్లించవచ్చు
కోర్సు పూర్తి చేసుకొని స్టార్టప్ ఏర్పాటు చేసుకున్న విద్యార్థులు, కోర్సు పూర్తి ఐన తర్వాత రెండేళ్ల తర్వాత నుండి ఋణం తిరిగి చెల్లించేలా వీలు కల్పించారు
వడ్డీ రేట్లలో ముఖ్యంగా మహిళలుకి 0.5% నుండి 1% వరకు రాయితీలు ఇస్తున్నారు.
IIM, IIT వంటి వంటి ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ లలో 10 లక్షల కంటే ఎక్కువగా ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో గరిష్ఠ ఋణం పెంచే అవకాశం ఉంది
మంజూరు ఐన విద్యా ఋణం బ్యాంకులు నేరుగా ఇనిస్టిట్యూట్ కే పంపుతాయి
ఒక వేళ తొలిసారిగా విద్యార్థులు ఫీజు కట్టి ఉంటే,రసీదులు ఆధారంగా కట్టిన ఫీజు విద్యార్థులు కి తిరిగి చెల్లించి తర్వాత దశ నుండి నేరుగా ఇనిస్టిట్యూట్ కే పంపుతాయి
ఋణం మొత్తం ప్రతి ఏటా అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే ఇనిస్టిట్యూట్ కి పంపుతాయి.ఐతే విద్యార్థులు ప్రతిభను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.చదువులో విద్యార్థులు ప్రతిభ సంతృప్తికరంగా ఉంటేనే మిగతా ఋణం మంజూరు చేస్తారు
కావలసిన ధ్రువ పత్రాలు
• ప్రవేశ దృవీకరణ పత్రం
• అర్హతల సెర్టిఫికెట్లు
• తలిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ
• తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతులు
• బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు
• నివాస ధ్రువీకరణ
• థర్డ్ పార్టీ ఆదాయ ధ్రువీకరణ
• కోర్సు వ్యయానికి సంబంధించి ఇనిస్టిట్యూట్ ల నుంచి అధీకృత లెటర్లు
COMMENTS