Female Students: విద్యార్థినులకు అలర్ట్.. ఉమెన్ హాస్టళ్లలో హిడెన్ కెమెరాలను ఇలా గుర్తించండి..
వాష్‌రూమ్స్‌లో కేటుగాళ్లు సీక్రెట్ కెమెరాలు పెడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీక్రెట్ కెమెరాలు ఎక్కడైనా ఉన్నట్లు డౌట్ వస్తే.. ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
అద్దంలో కెమెరా ఉందా?
హాస్టల్స్ వంటి ప్రదేశాల్లో అద్దంలోనే హిడెన్ కెమెరా పెడుతుంటారు. ఈ అద్దంలో కెమెరా ఉందా లేదా అనేది గమనించేందుకు దానిపై ఏదో ఒక ఫింగర్ ఉంచాలి. అప్పుడు ఆ ఫింగర్‌కి, అద్దంకి మధ్య కాస్త స్పేస్ కూడా లేకపోతే ఆ అద్దం టు-వే మిర్రర్ అని.. అందులో కెమెరా ఉందని అర్థం. అలాంటప్పుడు ఆ అద్దం వెనుక కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేయాలి.
గదిలో కెమెరాను ఎలా గుర్తించాలి?
- సొంత ఇల్లు కాకుండా కాలేజీ వంటి ప్రదేశాలలోని బాత్రూమ్, బెడ్‌రూమ్, రెస్ట్‌రూమ్, లాకర్ రూమ్‌లు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇలాంటి ప్రైవేట్ రూమ్స్‌లో కొందరు దుర్మార్గులు రహస్యంగా కెమెరాలు పెట్టే ప్రమాదముంది. ఇలాంటి రూమ్స్‌లో ఏవైనా కొత్తగా లేదా ఒక డివైజ్‌లాగా కనిపిస్తే ఆ రూమ్ యూజ్ చేయకపోవడమే మంచిది.
- సాధారణంగా కెమెరా లెన్స్ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ లక్షణం వల్ల కెమెరా ఒక రూమ్‌లో ఎక్కడ దాగుందో కనిపెట్టవచ్చు. అందుకు ఒక బాత్‌రూమ్‌లోకి వెళ్లాక అందులోని లైట్లను డిమ్ చేయాలి. ఆపై మీ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో ఆ రూమ్‌లోని ప్రతి భాగాన్ని చెక్ చేయాలి. అప్పుడు ఏవైనా మెరుస్తున్న లెన్స్ కనిపిస్తే వాటికి అడ్డుగా ఒక క్లాత్ పెట్టాలి. ఆ డివైజ్‌ను అన్‌ప్లగ్ చేయాలి. లేదంటే ఆ బాత్‌రూమ్ ఉపయోగించకపోవడం శ్రేయస్కరం.
- హిడెన్ కెమెరాలను హిడెన్ కెమెరా డిటెక్టర్‌తో కనిపెట్టొచ్చు. ఆండ్రాయిడ్ iOS యూజర్లు Fing యాప్ ఉపయోగించి వీటిని కనుగొనవచ్చు. వాల్ అవుట్‌లెట్లు, స్క్రూలు, నెయిల్స్, వాల్ క్లాక్‌లు, మొబైల్ ఛార్జర్లు, యూఎస్‌బీ డ్రైవ్‌లు, పవర్ బ్యాంక్‌లు, పెన్నులు, పిక్చర్ ఫ్రేమ్‌లు, పెయింటింగ్స్, మిర్రర్ డెకరేషన్లు, స్టఫ్డ్ యానిమల్స్ కుండీలలో ఎక్కువగా రహస్య కెమెరాలు ఉంచుతారు.
- నిఘా కెమెరాలు సమీపంలో ఉంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు స్టాటిక్ సౌండ్ లేదా ఒక డిస్టర్బెన్స్ సౌండ్ వినిపిస్తుంది. కాబట్టి మీరు వెళ్లిన రూమ్‌లో కూడా అలాంటి ఏదైనా సౌండ్ వినిపిస్తుందా అని చెక్ చేయాలి. రూమ్‌లోని ప్రతి భాగం వద్దకు వెళ్లి కాల్ మాట్లాడుతూ కాల్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ సౌండ్ వినిపిస్తుందా అని పరిశీలించాలి. సౌండ్ వినిపిస్తే వెంటనే ఆ భాగంలో క్షుణ్ణంగా చెక్ చేయాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి.
COMMENTS