శ్రీ ధన్వంతరీ జయంతి
ఈ రోజు "(కార్తీక బహుళ త్రయోదశి)'' నాడు -శ్రీ ధన్వంతరీ జయంతి- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
అది ఒక వనము , వనమనేకన్న అరణ్యము అంటే భావుంటుంది . . ఎందుకంటే అనేక రకాల ఫలవృక్షాల చేత సారవంతమైన భూమి పై మొలకెత్తిన మూలికలచేత శ్రావ్యమై , స్వరభరితమై ప్రకృతినే పరవశింపచేస్తున్న వేదఘోష చేత , పశుపక్ష్యాదుల సయ్యాటలచేత శోభిల్లుతున్నఅరణ్యమట . . . సృస్టి అంతములో జలావధిలో మునిగి పోకుండా ఉన్న ఏకైక ధరాతలమట .. అది . దానిపేరే " నైమిశారణ్యము . విధాత రాబోయే సృష్టి రచన కోసము మేధావులైన సప్తఋషివర్గాన్ని ఉంచడానికి నిలిపి ఉంచిన భూమి కనుక దానిని " నైమిశారణ్యము " అన్నారు. ఎన్నో వేద సంహితలకి , పురాణ ఇతిహాసాలకి , విజ్ఞానచర్చలకి ... అది అలవాలము . గంభీర వాతావరణములో కూర్చొనివున్నారు అందు ' అగస్త్యమహర్షి , గౌతమమహర్షి , భరద్వాజమహర్షి మొదలగు నిష్ణాతులైన , శాత్రజ్ఞులైన మహర్షులు . అందరు ఒకానొక రోజున మానవలోకము లో మనుజులు కనిపించని రోగాలు కొన్నింటికి , కనిపించి బాధపెట్టే మరెన్నో రోగాలకు గురి అవుతున్నారు . తెలియకుండా కబళిస్తున్న వృద్ధాప్యము , ప్రకృతి పరివర్తనలో విపరీతాల వలన వచ్చేటటువంటి సాంక్రమిక జనపద విధ్వంసక వ్యాధులు ... అంటే సమాజాన్నంతటినీ ఒకేసారి కబలించే కలరా , ప్లేగు , వైరల్ జ్వరాదులు - ప్రతీక్షణము మనిషి రోగ భయము తోనూ , మరణ భయముతోను బ్రతుకుతున్నాడని ఆలోచింప సాగారు . నివారణకోసము మార్గాన్ని అన్వేసించే దిశలో సమాదానము చర్చించుకుంటూ తమలో ఒకరైన భరద్వాజమహర్షిని ... ఆయుష్షును పోషించి రక్షించే వైద్యశాస్త్రాన్ని ఏదైనా తెలుసుకొని రమ్మని దేవేంద్రుని వద్దకు పంపారు.
దేవేంద్రుడు ఇంద్రలోక భోగలాలసుడే కాదు తన అర్హతవల్ల ఈ సృస్టి చక్కగా జరిపే ప్రతీశక్తికీ సంచాలకుడు . తనని దర్శించుకున్న బరద్వాజమహర్షిని ఉద్దేశించి " విధాత ముఖమునుండి వెలువడిన వేదాలలోని అధర్వణవేదానికి ఉపవేదముగా ఉన్న ఆయుర్వేదాన్ని తెలియజేసాడు . ఈ ఆయుర్వేదము క్షీరసాగగ మధనము లో చివరిగా అమృతభాండము తో పుట్టిన " ధన్వంతరి" భగవానుల సృష్టి అనియు , మృత్యువునుంచి , రోగాలనుండి రక్షించే ఓషదులతో నిక్షిప్తము చేయబడిందనియు చెప్పెను . విధాతనుండి నేను (ఇంద్రుడు),నానుండి సూర్యభగవానుడు , సూర్యును నుండి నకుల , సహదేవులు , అశ్వనీదేవతలు గ్రహించారని చెప్పి " అయుర్వేదాన్ని ఉపదేశించారు .. భరద్వాజమహర్షికి . అలా వైద్యశాస్త్రానికి మూలపురుషుడు ధన్వంతరి . Father of Ayurveda - ఆయుర్వేద వైద్యపెతామహుడుగా ఖ్యాతి గాంచినవారు ఈ ధన్వంతరి .ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనస్సుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలు అనుభవించడానికి ఆరోగ్యమే ఉండాలి. అందుకే పెద్దలు దీవించేటప్పుడు ‘‘ఆయురారోగ్య ఐశ్వర్య, సంతాన, ఉద్యోగ ప్రాప్తిరస్తు’’ అంటారు. ఆయువు తర్వాత ఆరోగ్యానికే పెద్దలు ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తుంది. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. సకల రోగాల విముక్తికై మనమంతా ధన్వంతరిని పూజించాలి. సాక్షాత్తూ విష్ణుమూర్తియే ధన్వంతరిగా పాలకడలి నుండి అమృతభాండం పట్టుకుని అవతరించిన రోజు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఈ రోజున ధన్వంతరి పూజ తప్పక చేయాలి.
వైద్యవిద్యకు అధిదేవుడు. సనాతన వైద్య శాస్తమ్రైన ఆయుర్వేదాన్ని వృత్తిగా గైకొన్నవారు ఈ రోజు ధన్వంతరీ పూజ చేస్తారు. యాగాలు చేస్తారు. వైద్యులు మాత్రమే ధన్వంతర యాగాన్ని, పూజలను చేస్తారని, మరెవ్వరూ చేయరు అనే భావన చాలామందిలో ఉంది. కాని ఈ ధన్వంతరి భవరోగాలను పోగొట్టే దైవం. అందుకే ధన్వంతరి వ్రతాన్ని ఆనవాయితీగా లేనివారు కూడా ఆనాడు శ్రీమన్నారాయుణిడిని, ధన్వంతరిని స్మరించుకొని హరినామస్మరణ చేస్తే సకల రోగాలు పటాపంచలవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తమవుతాయి. ఆయుర్వేదానికి ప్రథమ గురువు సుశ్రుతుడు. ధన్వంతరి నుండి మొదట ఆయుర్వేద శాస్త్రం ఉపదేశం పొందినాడు. ప్రపంచంలోని ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు, ప్రతి చెట్టు ఔషధాల నిస్తుందని చెప్తుంది ఆయుర్వేదం. కేరళ రాష్ట్రంలో త్రిశూరవద్ద ధన్వంతరి ఆలయం ఉంది. అనారోగ్యంతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి విష్ణు సహస్రనామార్చన చేస్తే అన్ని రోగాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం.
పురాణ కథనం ప్రకారం సురాసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు. ధర్మాచరణతో మనుగడ సాగించేవారికి అపారమైన జ్ఞానాన్ని, అనంతమైన సంపదను అందించడానికి విశ్వపాలకుడు, జగద్రక్షుడైన ఆ నారాయణుడు నడుం కట్టాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని పరమశివుడు మింగేసి గరళకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, ఉచె్తై్చశ్రవం పుట్టాయి. ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మీ, కల్పవృక్షం ఉద్భవించింది. చిట్టచివరగా శ్రీమన్నారాయణుడు పరిపూర్ణ ప్రశాంత సాకార పరంజ్యోతి స్వరూపుడుగా ధన్వంతరి రూపం ధరించి చేతిలో అమృత కలశంతో వెలుపలికి వచ్చాడు. అమృత కలశంలోనే సమస్త శారీరక, మానసిక, అజ్ఞానరోగాలకు ఔషధాలు నిక్షిప్తమై ఉన్నాయి. శ్రీమహావిష్ణువుకు ప్రతి రూపమైన ధన్వంతరి నాలుగు భుజాలుతో ఉద్భవించాడు. దేవదానవులు అతనికి నమస్కరించారు.
వైభవంగల ధన్వంతరి (శ్రీమహావిష్ణువు) పటాన్ని కుంకుమతో, పుష్పాలతో అలంకరించి, స్వామి సహస్రనామాన్ని పఠిస్తూ తెల్లపూవులు లేదా తులసీ దళాలతో అర్చించాలి. అనంతరం పాయసాన్ని నివేదించాలి. ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ ముందుగా స్వీకరించి అనంతరం ఖచ్చితంగా కనీసం అయిదుగురికైనా పంచాలి. అమృతం పంచిన తర్వాత ఇంద్రుని ప్రార్థించి ధన్వంతరి దేవవైద్య పదవి స్వీకరించాడు. కాలక్రమంలో భూమిపై మనుష్యులు అనేక రోగాల పాలయ్యారు. ఇంద్రుని ప్రార్థన మేరకు ధన్వంతరి కాశీరాజైన దివ్‌దాసుగా అవతరించాడు. అప్పుడే ‘్ధన్వంతరి సంహిత’ పేరుతో ఆయుర్వేద మూల గ్రంథం అందించాడు. మనమందరం ఆరోగ్యవంతులుగా ఉండుటకు, కాలుష్య రహిత వాతావరణంలో జీవించుటకు ధన్వంతరి పూజలు చేసి, నాడు చెప్పిన ఆరోగ్య నియమాలను పాటిద్దాం.
COMMENTS