CSIR-TKDL Recruitment 2022: Project Associate Jobs in Traditional Knowledge Diesel Library, Hyderabad.
CSIR-TKDL Recruitment 2022: హైదరాబాద్‌లోని ట్రెడీషనల్ నాలెడ్జ్ డిజిల్ లైబ్రరీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.
CSIR-TKDL Project Associate Recruitment 2022: సీఎస్ఐఆర్ – ట్రెడీషన్ నాలెడ్జ్ డిజిల్ లైబ్రరీ (CSIR-TKDL).. 32 సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి (Senior Project Associate Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆయుర్వేద, యురానీ, సిద్ధ, సోవా రిగ్పా విభాగాల్లోని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, జమ్ము, శ్రీనగర్, చెన్నై, లేహ్, పలమ్పూర్లలో పని చేయవల్సి ఉంటుంది.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఆయుర్వేదలో బీఏఎమ్ఎస్/ఎమ్డీ (ఆయుర్వేద), బీఏఎమ్ఎస్ (యునానీ)/ఎమ్డీ (యునానీ), బీఏఎమ్ఎస్ (సిద్ధ)/ఎమ్డీ (సిద్ధ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 13, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో ఎవ్వరూ అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.
విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్సులను కూడా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
CSIR TKDL Recruitment Notification 2022 PDF Check Here
Apply Online Apply Now
COMMENTS