CDLU Recruitment 2022
CDLU Recruitment 2022: రూ.లక్ష జీతంతో చౌదరీ దేవి లాల్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ.
Chaudhary Devi Lal University Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హర్యాణాలోని చౌదరీ దేవి లాల్ యూనివర్సిటీ (Chaudhary Devi Lal University).. 53 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిందీ, లా, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బోటనీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, హిస్టరీ అండ్ అర్కియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్, మ్యాథమెటిక్స్, పంజాబీ, సంస్కృతం, జువాలజీ, ఇంగ్లిష్ అండ్ ఫారెన్ ల్యాంగ్వేజ్, జాగ్రఫీ, మ్యూజిక్ తదతర స్పెషలైజేషన్లలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంపీఈడీ, ఎంఈడీ, ఎంఏ ఎండ్యుకేషన్, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
యూసీజీ నెట్, స్లెట్‌లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 18, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనంతరం పూర్తి చేసిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు అక్టోబర్ 26వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.
దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000, హర్యానా రాష్ట్ర అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీఏ/బీసీబీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి నెలకు రూ.95,000ల నుంచి రూ.1,44,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: Chaudhary Devi Lal University, Sirsa, Haryana.
Notification Click here
Apply Online Click here
Official Website Click here
COMMENTS