Anglo-Indian Day
Anglo-Indian Day , ఆంగ్లో ఇండియన్ డే ప్రతి సంవత్సరమూ ఆగస్టు 02 వ తేదీన జరుపుకుంటారు .
* భారత దేశాన్ని బ్రిటిష్ వారు సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు . వారిపాలనలో అనేక మంది యూరోపియన్‌లు భారత దేశానికి ఉద్యోగరీత్యా వచ్చారు . వారిలో కొందరికి స్థానికులతో వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి . వీరిని మొదట్లో ఊరోపియన్ లు గానే వ్యవహరించేవారు . 1935 లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము వీరికి " ఆంగ్లో-ఇండియన్లు " గా కొత్త స్టేటస్ ఇచ్చినది . వీరికి ఉద్యోగాలలో రిజర్వేషన్‌లు కూడా ఉండేవి ,ఈ రిజర్వేషన్లు 1962 లో రద్దుచేశారు .
*ఆంగ్లో ఇండియన్లు గా మైనారిటీ హోదాను అనుభవిస్తున్న వారిది క్రైస్తవ మతం . . . ఇంగ్లీషు మాతృభాష , వారి వేష భాషలు , ఆహారపు అలవాట్లు యూరోపియన్ పద్దతిలో ఉంటాయి . మన దేశములో ఆంగ్లో-ఇండియన్లు దాదాపు 06 లక్షల మంది ఉండగా ... దేశము వెలుపల వివిద దేశాల లో మరో 05.5 లక్షల మందిదాకా ఉన్నారు . 19 వ శతాబ్దం లో బ్రిటిష్ , ఇండియన్ సొసైటీలు రెండూ కూడా వీరిని కలుపుకోవడానికి తిరస్కరించడం తో వారు తమ జీవిత భాగస్వాములు తో ఆంగ్లో-ఇండియన్ల సంతతి నడుమనే జీవనాన్ని సాగించవలసి వచ్చినది . కాలక్రమేనా వీరి జనాభా పెరుగుతూ వచ్చింది . రైల్ , రోడ్ , పోస్టల్ ... ఇతర కస్టమ్‌సు సేవావిభాగాల్లో వృత్తిపర స్థానం పొందుతూ్ వచ్చారు . వారికోసం ప్రత్యేక ఆంగ్ల స్కూల్స్ వవస్థ , సంస్కృతులు అభివృద్ధి చెందాయి .
భారత స్వాతంత్రోద్యమ కాలములో చాలామంది ఆంగ్లో-ఇండియన్ లను బ్రిటిష్ పాలనలో గుర్తించారు . దీంతో భారతీయుల అపనమ్మకాన్ని , తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది . స్వాతంత్రోద్యమకాలములో వారి స్థితి గతులు క్లిస్టము గా మారాయి . బ్రిటిషర్ల కు అనుచరులని భావించడం తో కొద్దిపాటి సామాజిక గుర్తింపు మాత్రమే లభించేది . భారతదేశం లో అభద్రతాభావము వారిని వెన్నాడింది . తమకు ముఖ్యమైన ప్రభుత్వస్థాయిలు కల్పించాలని కోరుతూ వారు ఉద్యమం లో పాల్గొన్నారు . రాజ్యాంగబద్ధము గా లభించిన కమ్యూనిటీలు , మత , భాషా పరమైన హక్కులు రీత్యా తమ స్వంత స్కూళ్ళు నడుపుకోవడానికి , ఆంగ్లభాషను మాధ్యమం గా ఉపయోగించడానికి ఆంగ్లో-ఇండియన్ లకు అనుమతి లభించింది . ఈ కమ్యూనిటీ సమక్యతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వము ఇతర భరతీయ కమ్యూనిటీల నుంచి వచ్చే విద్యార్ధులకు కొంతశాతాన్ని ఏర్పాటుచేసింది .
ప్రస్తుత బ్రభుత్వ ఉద్యోగాల విషయం లో ఆంగో-ఇండియన్ ల పట్ల వివక్ష ప్రదర్శించిన దాఖలాలు లేవు . వారిలో కొంతమంది ఉన్నతాధికారులు గా ఉన్నారు . ఇంకొందరు న్యాయమూర్తుల హోదాలో ఉన్నారు . 1990 నాటికి బారతీయుల జీవనవిధానము లో ఆంగో-ఇండియన్ లు వృత్తిరీత్యా కలిసిపోయారు . ఐతే సామాజికం గా మాత్రము వారు దూరం గానే ఉండిపోయారు . ఇతర ఆంగ్లో-ఇండియన్‌లు సంతతి నడుమ మాత్రమే వారి వివాహాలు పరిమితమయ్యాయి . "The way we are " అనే సి.ఆర్.టి. ప్రచురణ సంస్థ పుస్తకం వీరి జీవన విధానాలు , విజయాలకు అద్దం పడుతుంది . ' ఆంగ్లోస్ ఇన్ ది విండ్ ' అనే త్రైమాసిక పత్రికను ఆంగ్లో-ఇండియన్ లు ప్రచురిస్తున్నారు .
సౌత్ లండన్ ఆంగ్లో-ఇండియన్ అసోసియేషన్ .. ప్రపంచ ఆంగ్లో-ఇండియన్ దినోత్సవాన్ని వివిధ దేశాల్లో విస్తేఇంచినున్న ఆంగ్లో-ఇండియన్ లకు గుర్తింపుగా 2005 జూలై 30 వ తేదీన ఇంగ్లండ్ లో నిర్వహించారు . హైదరాబాద్ లో మొదటిసారి అదే ఏడాది ఆగస్టు 2 వ తేదీన ఆంగ్లో-ఇండియన్ దినోత్సవాన్నీ నిర్వహించారు . ఆంగ్లో-ఇండియన్ అన్న పదాన్ని నిర్వచించే వట్టాన్ని 1935 ఆగస్ట్ 2 న చేసారు . కాబట్టి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని అదే రోజు జరపాలని నిర్ణయించారు . వివిధ దేశాల్లోని అంగ్లో-ఇండియన్ అసోసియేషన్ లు అన్నీకలిపి " ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంగ్లో-ఇండియన్ అసోసియేషన్ " గా ఏర్పడ్డాయి . ఆర్టికల్ 330, 331 ప్రకారము లోక్ సభకు ఇద్దరు , రాస్ట్రాల లోని విధానమండలి కి ఒకరు ఆంగ్లో-ఇండియన్ లను సభ్యులు గా నియమించే ఏర్పాటు కల్పించారు .
వీరి సంస్కృతి , సంప్రదాయాల్ని ప్రతిబింబించే అనేక పుస్తకాలు , మేగజైన్ లు అందుబాటులో ఉన్నాయి .
COMMENTS