యువజన దినోత్సవం(అంతర్జాతీయ)
నేడు అంతర్జాతీయ యువజనోత్సవం( International Youth Day) - -ఆగస్టు 12.. ప్రతిసంవత్సరము .
భారతదేశము లో యువజన దినోత్సవాలు స్వామి వివేకానంద జయంతి రోజున జరుపుకుంటారు .
ఒక మార్గం., ఒక దిశా నిర్దేశం., చివరికి గమ్యం.. కోసం ... కఠోర సాధన చేయాలి.. నటనలో రాణించాలా...? అన్నిభాషల సినిమాలు చూడాలి.. నాట్యం నేర్చుకోవాలా..? అయితే నిరంతరం శ్రమించాలి.. విదేశీ చదువులా? ఉద్యోగమా? అన్ని వెబ్‌సైట్లు వెదుకుతూనే ఉండాలి..పట్టువదలని విక్రమార్కులు..వీరు!
గగనమే వీరి గమ్యం - విభిన్న నేపథ్యం.. వైవిధ్య దృక్పథం . ఎంచుకున్న రంగాల్లో గగనం చేరేవరకు వీరికి గమనమే గమ్యంగా సాగిపోతామంటున్నారు. పట్టుదల, నైపుణ్యాలనే తాళ్లుగా చేసి హరివిల్లుపై ఊయలలు ఊగగలరు. కష్టాలు పలుకరించినా.. జీవితంకనికరించకున్నా.. ఎదురొడ్డి పోరాడగలమంటున్నారు. వివిధ రంగాల్లో భవిష్యత్తు తరాలకు తామే దీపధారులం కాగలమని చెప్పకనే చెబుతున్నారు... నేటి యువత .
యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలి . యువత మద్యపానం, దూమపానం, మాదకద్రవ్యాలు వంటి దురలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలి . ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి , గ్రామాభివృద్దికి కృషి చేయాలి , యువత ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలి . ఇవీ వీరి పనులు .
నేటి యువతే రేపటి భవిత అంటారు . యువతకు గల శక్తి అంతులేనిది . . అపారమైనది . దేశ ఉన్నతికి , ఔన్నత్యానికి ఈ శక్తిని ఫణం గా పెడితే అన్నీతిరుగులేని విజయాలే ఉంటాయి. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు , సామాజికమైనవి ,. తద్వారా జాతీయం , అంతర్జాతీయం అయినవి . ఈ శక్తి ఎప్పుడూ అనుకూల పధం లో సాగాల్సి ఉంది . యువ శక్తి దేశానికి ఎంత మేలు చేస్తుందో .. గతి తప్పితే అంతకు రెట్టింపు కీడుచేస్తుంది .
నేటి తరానికి బాధ్యతలు గుర్తు చేసేందుకు , యువతకు గల శక్తిని చాటి చెప్పేందుకు గాను గత పదేళ్ళుగా అంతర్జాతీయ యువజనోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు .
ఎలా మొదలైంది .--?
1995 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల ఎవేర్నెస్ పెంచేందుకు ఓ మార్గం గా ఆ కార్యక్రమానికి మద్దతుగా ఆరోజున ప్రజా సమాచార కార్యక్రమాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది . అప్పటి నుండి ఏటేటా ఒక్కో థీమ్ ను అనుసంధానం చేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు . ప్రపంచవ్యాప్తము గా ఉన్న యువత సమస్యల పట్ల ప్రభుత్వాలు , ఇతరులు శ్రద్దచూపేందుకు ఇదో అవకాశం గా ఉంది .
1999 లో యువత బాధ్యతలు నిర్వహించే మంత్రుల పపంచసదస్సు చేసిన సిఫార్సులమేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 12 వ తీదీని అంతర్జాతీయ యువజన దినం గా ప్రకటిస్తూ తీర్మానము చేసింది . వర్క్ షాపులు , సాంస్కృతిక కార్యక్రమాలు , సమావేశాలు ద్వారా జాతీయ , స్థానిక ప్రభుత్వాధికారుల్ని , యువజన సంస్థల్ని భాగస్వాముల్ని చేస్తూ యువజన దినం ఒక్కో థీమ్ తో నిర్వర్తించాలని నిర్దేషించినది .
ఇప్పటికి ఎంచుకున్న థీమ్‌లు :
2000 : తొలి ఇంటర్నేషనల్ యూత్ డే నిర్వహించారు . " యువత భావి పౌరులు " అన్నది ఆ ఏటి థీమ్ . అప్పటిదాకా యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యక్రమాలపట్ల అవగాహన పెంచడాన్ని లక్ష్యము గా చేసుకున్నారు . విద్య , ఉద్యోగము , పేదరికము , ఆరోగ్యము , వాతావరణము , డ్రగ్స్ , బాలనేరాలు , ఖాళీ సమయాల్లో పనులు వంటివన్నీకార్యక్రమాలలో భాగాలు .
2001 : ఎయిడ్స్ , నిరుద్యోగ వ్యతిరేకతలు ఈ ఏడాది థీమ్ గా తీసుకున్నారు .
2002 : " ఇప్పుడు మరియు భవిష్యత్ కోసం , సుస్థిర అభివృద్ధికోసం యువత కార్యాచరణ " అన్నది ఈ ఏడాది థీమ్ పరిసరాలు , నిర్ణయాల్లో అభివృద్ధి , దీర్ఘకాలిక విజయాలపై దృష్టి సారించారు .
2003 : "ప్రతిచోట యువతకోసం చక్కని ఉత్పాదికమైన పని చూడడం " ఈ సంవత్సరం థీమ్ .
2004 : " అంతర తరాల సమాజం లో యువత " ఈ ఏడాది థీం . అన్ని స్థాయిల్లో అంటే కుటుంబము , కమ్యూనిటేలు , దేశాలలో తరాలు నడుమ సామరస్య ప్రాముఖ్యాన్ని ఈ థీమ్ హైలైట్ చేసినట్లైనది .
2005 : " WPAY+10 మరియు నిబద్ధతా అంశాలు " ఐక్యరాజ్యసమితి లో యువతకు ఇది ముఖ్యమైన ఏడాది . జనరల్ అసెంబ్లీ 60 వ సదస్సుకు గుర్తుగా యువత అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరిగింది .
2006 : " సమైక్యం గా పేదరిక నిర్మూలన - యువజనులు మరియు పేదరిక నిర్మూలన " ఈ సం . థీమ్ . ఆకలి , పేదరికం లను ప్రధానాంశాలుగా తీసుకున్నారు .
2007 : " చూడాలి , వినాలి -అభివృద్ధిలో యువత భాగస్వామ్యము " 2007 సం . థీమ్ . అన్ని స్థాయిల్లోని నిర్ణయాల్లోయువతను భాగస్వామ్యము చేయాలని తీర్మాణము జరిగినది .
2008 : " మీరెలా సెలబ్రేట్ చేస్తారు " అన్నది ఈ 2008 థీమ్ .
2009 : " సుస్థిరత , మన సవాళ్ళు -మన భవిష్యత్తు " అనే నినాదము తో యువతీయువకులకు పిలుపు ఈ 2009 సం .థీమ్.
2010 : " చర్చలు - పరస్పర అవగాహన " ఈ 2010 సం . థీమ్ . విభిన్న సంస్కృతులు , విభిన్న తరాలకు చెందిన యువత నడుమ చర్చల విలువకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అందిస్తున్న ప్రశంసల్ని ఈ థీమ్ ఎంపిక బాగా ప్రతిబింబిస్తుంది .
ఇలా అనేక థీమ్ లతో నిర్వహించిన అంతర్జాతీయ యువజన దినోత్సవాలు ముందుకు సాగాయి . యువతరం తమ ధోరణి మార్చుకోవాలి .. తెరుగులేని తమ శక్తితొ వ్యక్తిగతం గాను , సామాజికం గాను , జాతి పరం గాను ఎదగాలి .అప్పుడే యువజనోత్సవాలు సార్ధకమౌతాయి .
COMMENTS