ఎన్సీసీతో ఆర్మీలో ఆఫీసర్ స్పెషల్ ఎంట్రీ ప్రకటన విడుదల.
మొత్తం ఖాళీలు: 55 (50 పురుషులకు, 5 మహిళలకు) ఈ రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు (పురుషులు 5, మహిళలు 1) యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ఏప్రిల్ 1, 2003లోగా డిగ్రీ పూర్తిచేయాలి. అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్సీసీ సీనియర్ డివిజన్ వింగ్ కొనసాగి ఉండాలి. ఎన్సీసీ సి సర్టిఫికెట్లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్సీసీ సి సర్టిఫికెట్ అవసరం లేదు.
వయసు: జనవరి 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. జనవరి 2, 1998 జనవరి 1. -2004 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక విధానం: ఆర్మీ ఏడాదికి రెండుసార్లు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. డిగ్రీతోపాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి. శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ, వేతనం:
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ విధానంలో ఎంపికైనవారికి ఏప్రిల్, 2023 నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ. చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు.
వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థులు ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మినెంట్ కమిషన్) కిందికి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. ఆ తర్వాత వీరు వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్ విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సేవలతో మేజర్. 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఎస్ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ. లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఎన్నో ప్రోత్సాహకాలు పొందవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు: సెప్టెంబరు 15 మధ్యాహ్నం 3 వరకు
Indian Army NCC 53 Special Entry Recruitment 2022 Important Links:
Indian Army NCC Special Entry Recruitment 2022 Online Apply Link
COMMENTS