ధరిత్రి దినోత్సవం
US లో భూమి దినము ను ఏప్రిల్ 22న జరుపుకొంటారు,ముఖ్యముగా భూమి గురించి తెలుసుకోవటానికి ఇంకా మెచ్చుకోవటానికి ఈ రోజును కల్పన చేశారు.U.S. సభాసదుడు గేలార్డ్ నెల్సన్ (డి-విస్కాన్సిన్) ఒక పర్యావరణ ఉపదేశంతో 1970 లో ఆరంభించారు ఇంకా దీనిని ప్రతిసంవత్సరం చాల దేశాలు జరుపుకొంటున్నాయి. ఈ తేదీ ఉత్తర అర్ధగోళంలో వసంతఋతువులో రాగా, దక్షిణ అర్దగోళంలో ఇది శరదృతువులో వస్తుంది.
యునైటెడ్ నేషన్లు ప్రతిసంవత్సరం భూమిదినము ఎక్కువగా మార్చి 20న జరుపుకునే ఆచారముంది, దీనిని స్థాపించినది 1969 లో శాంతి కార్యకర్త జాన్ మకోనేల్ .
వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ.. ప్రపంచంలోని దేశాలన్ని.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజున పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి ఏటా ఏదొక థీమ్‌తో ముందుకు వస్తారు. ఈ ఏడాది థీమ్ ఏంటో, మొదటిసారి ఈ డేని ఎక్కడ జరిపారో తెలుసుకుందాం.
World Earth Day 2023 | ప్రపంచ ధరిత్రి దినోత్సవం. దీనిని అంతర్జాతీయ మదర్ ఎర్త్‌డే అని కూడా పిలుస్తారు. దీనిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన నిర్వహిస్తుంటారు. రోజు రోజుకూ తీవ్రమవుతున్న ప్రపంచ వాతావరణ సంక్షోభంపై దృష్టి సారిస్తూ ఎర్త్‌డే చేస్తారు. అధిక జనాభా, జీవవైవిధ్యాన్ని కోల్పోవడం, ఓజోన్ పొర క్షీణించడం, పెరుగుతున్న కాలుష్యంతో సహా పెరుగుతున్న పర్యావరణ సమస్యలపై ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఎర్త్ డే చరిత్ర
అంతర్జాతీయ మదర్ ఎర్త్ డేని ఏప్రిల్ 22, 1970వ సంవత్సరంలో తొలిసారి నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్ కన్నెల్.. మదర్ ఎర్త్, శాంతి భావనను గౌరవించాలని ప్రతిపాదించారు. ప్రపంచ ఎర్త్ డేని ముందుగా మార్చి 21, 1970న ఉత్తర అర్ధగోళంలో వసంతకాలం ఒకటిగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత యూఎస్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఏప్రిల్ 22, 1970న దేశవ్యాప్త పర్యావరణ జ్ఞానోదయాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత దీనిని 'ఎర్త్ డే'గా మార్చారు.
ఎర్త్ డే ఎందుకు నిర్వహిస్తారంటే..
కాలుష్యం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యలను చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలను కనెక్ట్ చేయడానికి దీనిని నిర్వహిస్తున్నారు. వివిధ వాతావరణ సమస్యల గురించి యువకులకు అవగాహన కల్పించడానికి.. వారితో చర్చలు నిర్వహించడానికి ఈవెంట్‌లను నిర్వహిస్తారు.
ఎర్త్ డే రోజున వాతావరణ మార్పుల గురించి అవగాహన పెంచడానికి, గూగుల్ నాలుగు స్థానాలకు సంబంధించిన యానిమేషన్‌ల శ్రేణిని రూపొందించింది. మీరు ఈరోజు క్రోమో ఇంటర్నెట్ బ్రౌజర్‌లో గూగుల్ శోధన హోమ్‌పేజీని సందర్శించినప్పుడు.. మీరు టైమ్‌లాప్స్ యానిమేషన్‌ను చూస్తారు. ఈ యానిమేషన్లు సమయ వ్యవధిలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రదర్శించడానికి ప్రతి గంటకు మారుతుంటాయి.
ప్రకృతి భూమ్మీదున్న సమస్త జీవరాసులను కాపాడుతూ వస్తోంది. కొన్ని నియమాలకు లోబడి తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఆ ప్రకృతితో మానవుడు చెలగాటమాడకూడదు. దాంతో స్నేహంగా వుంటూ తమన పని తను చేసుకుపోవాలి. దాని అస్తిత్వాన్ని దెబ్బ తీస్తే మాత్రం అది మూడో కన్ను తెరుస్తుంది. ఆ మహోగ్రరూపానికి భూమ్మీద గడ్డి పరక కూడా మిగలదు. మహా ప్రళయమంటే అదే. అప్పుడంతా నాశనం కావాల్సిందే. సమీప భవిష్యత్తులో జరిగిది ఇదే. పుడమి తల్లి కన్నెర్ర చేసే కాలం దగ్గరపడింది..మూడో కన్ను తెరచే సమయం ఆసన్నమైంది. ఇంతకాలం భూగర్భంలో భగ భగమని మండుతోన్న ఉష్ణం ఉబికివచ్చే తరుణం వచ్చేసింది. సమస్త జీవరాసులను వణికిస్తూ మానవాళిని వెంటాడేస్తుంది…నిప్పులు చిమ్మకుంటూ వచ్చే ఆ ప్రచంఢాగ్నికి సర్వం వినాశమవుతుంది. ధ్రువాల మంచు కరడగం, సముద్ర మట్టాలు పెరగడం, ద్వీపసమూహాలన్ని సముద్ర గర్భంలో నిక్షప్తమవవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఈ విపత్కర పరిణామాలే కాదు. సమీప భవిష్యత్తులో కరువు కాటకాలు, వరదలు, తుపానులు భూమండలాన్ని అతలాకుతలం చేస్తాయని అమెరికన్ శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమ్మీద నిత్యం విడుదల అవుతున్న ఉష్టం మొత్తం బయటకు వెళ్లడం లేదు. అందులో సగానికి సగం భూమ్మీదే దాగి వుంటోంది. ఏదో సమయంలో అది ఉబికి రావచ్చు. అదే జరిగితే ఊహించడానికే భయమేస్తోంది.
రోడ్లపై క్షణం తీరక లేకుండా తిరుగాడుతున్న వాహనాలు. నిరంతరం పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీలు. ఇలాంటి వాటిల్లో ఇంధనం దహనం కావడం వల్ల విడుదలయ్యే ఉష్టం భూమి నుంచి విడుదల అవుతున్న దానికి సమానంగా వుండాలి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. వాతావరణంలోకి ప్రవేశించే ఉష్టం కంటే బయటికి పోయే ఉష్టం తక్కువవుతోందని అమఎరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియర్‌కు చెందిన జాన్ ఫసుల్లో అభిప్రాయపడుతున్నాడు. భూమ్మీద ఎంత ఉష్టం విడుదల అయిందో అంతే ఉష్టం వాతావరణం నుంచి బయటకు వెళుతున్నట్టు ఉపగ్రహ సెన్సర్లు…ఇతర పరికరాలు గుర్తించాలి. అయితే అలా జరగడం లేదు. ఆ ఉష్ణమంతా సముద్ర గర్భంలో వుంటోంది. దీని కారణంగానే పసిఫిక్ మహా సముద్రంలోని ఎల్‌నినోలు సంభవించి ఉష్ట ప్రాంత భూముల్లో వర్షాభావ పరిస్థితులు వస్తాయి. మరికొన్ని చోట్ల కనివినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తుతాయి. కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తాయి. అతివృష్టి అనావృష్టి వరసపెట్టి వస్తాయి. వాతావరణంలో జరుగుతున్న మార్పులన్నింటికీ మనమే బాధ్యులం. భూమిపై పెరుగుతోన్న ఉష్టోగ్రతలకు మనమే కారణం…ముందస్తు హెచ్చరికలు లేకుండా ముంచుకొస్తున్న పెను విపత్తులకు మనమే కారకులం. వాతావరణంలోనూ సముద్రగర్భంలోనూ ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ధ్రువాల మంచు కరిగే శాతం ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఇంధన వాడకమే గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం..మరో పక్క ఓజోన్ పొరకు చిల్లు ఏర్పడటం వల్ల భూమిపై ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా తరచుగా వైపరీత్యాలు వచ్చిపడుతున్నాయి. అధిక ఉష్టోగ్రతల కారణంగానే కాలాల మధ్య విభజన రేఖ చెరిగిపోతోంది. ఇప్పుడు కాలాలు క్రమం తప్పాయి. చలికాలం నుంచే ఎండాకాలం మొదలై అది వర్షాకాలం వరకు కొనసాగుతోంది. ఉష్టోగ్రతలు పెరగడం వల్ల అనేక జీవజాతుల్లో ఆరోగ్యం దెబ్బ తింటుంది. కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. పునరుత్పాదక సామర్థ్యం తగ్గుతుంది. కొన్నాళ్లకు కొన్ని జీవరాసులు భూమ్మీద నుంచి సెలవు తీసుకుంటాయి. తిమింగలాలు, డాల్ఫిన్‌లు, తాబేళ్లు, పక్షులు అంతరించిపోతాయి.
వాతావరణంలో పెరుగుతున్న కర్బన తీవ్రత పర్యావరణ వేత్తలను బెంబేలెత్తిస్తోంది. గడచిన ఆరున్నర లక్షల సంవత్సరాలలో ఇంత కర్బన తీవ్రత లేదంటే ప్రస్తుత పరిస్థితి ఏంటో ఆలోచించాల్సిందే. పారిశ్రామికీకరణ జరగక ముందు వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్ ఘనపరిమాణం 280 పార్ట్స్ పర్ మిలియన్. అది క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఇదే లెవల్లో పెరిగితే ఈ శతాబ్దాంతానికి గరిష్టంగా 1260కి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు సైంటిస్టులు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మానవాళి తట్టుకోగల అత్యధిక కర్బన పరిమాణం 550 పార్ట్స్‌పర్ మిలియన్ మాత్రమే. ఈ లెక్కలు వింటే వెన్నులో సన్నటి వణుకురాలేదూ! నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. మనిషి చేజేతులా అంతాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. తను అంతమవ్వడమే కాకుండా ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నాడు. 50 ఏళ్లుగా హరితవాయువుల పెరుగుతున్నాయి. 1950లో 100 కోట్ల టన్నులన్న ఈ వాయువులు 2000 నాటికి 650 కోట్ల టన్నులకు పెరిగింది. పర్యావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు అధికమయ్యే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుతాయి. వాతావరణంలో ఇప్పటికే కార్బన్‌డై యాక్సైడ్ వాయువు గాఢతలు పెద్ద ఎత్తున చేరాయి. ఆర్కిటిక్ ప్రాంతాన్నే తీసుకుంటే ఇక్కడ కొన్నిమీటర్ల మందంతో కొన్నేళ్లపాటు ఘనీభవించిన మంచు నెమ్మదిగా కరిగిపోతోంది. దీనికి కారణం వాతావరణం వేడెక్కడమే. మంచు కరిగితే నష్టం ఏమిటి అంటే చాలానే ఉంది. మంచుకు కర్బనాన్ని బంధించేగుణం ఉంటుంది. మంచు కరగడం వల్ల కర్బనం గాలిలోకి విడుదల అవుతుంది. అలా విడుదలయిన కర్బనం ఇంకా వేడిని పెంచుతుంది. దీంతో మంచు కరిగే వేగం పెరుగుతుంది. ఇదంతా ఓ సైకిల్. ఒక ఏడాదిని మించి మరో ఏడాది ఎండలు మండిచడంలో రికార్డుకెక్కుతోంది. దీనికి కారణం ఆర్కిటిక్ సముద్రంలో హిమానీ నదుల వైశాల్యం తగ్గిపోవడమేననేది సైంటిస్టుల అభిప్రాయం. ఈ ప్రభావం ఒక్క ఉష్ణమండల ప్రాంతాల్లోనే కాదు మిగిలిన చోట్ల కూడా ఉంటుంది.
జరుగుతున్న పరిణామాలకు బాధ్యులుగా అన్ని దేశాలు అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలనే చూపిస్తున్నాయి. గత రెండొందలేళ్లలో వాతావరణాన్ని కలుషితం చేయడంలో 83శాతం పాపం అభివృద్ధి చెందిన దేశాలదే అంటున్నాయి. ఏటా వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్‌డైయాక్సైడ్ పరిమాణంలో అమెరికా వాటా 25 శాతం అని లెక్కలు గడుతున్నారు. అందుకే గ్లోబల్ వార్మింగ్ విషయంలో చొరవతీసుకుని ముందడుగు వేయాల్సింది అభివృద్ధి చెందిన దేశాలే. గ్లోబల్‌వార్మింగ్‌ను ఎదుర్కొనే బాధ్యత ఒక్క ప్రభుత్వానిదో, ఒక్క సంస్థదో కాదు. అందరిదీ. పౌరులు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. భూగోళాన్ని రక్షించుకోడానికి నడుం బిగించాలి. మనవంతుగా మనం చేయాల్సిన పనులు చేయాలి. కాలుష్యాన్ని నియంత్రిచాలి. ఉదాహరణకు….ప్లాస్టిక్. ఇది వేలాది సంవత్సరాలైనా భూమిలో కరగదు. అలాంటి ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న వస్తువు కొనుగోలు చేసినా ప్లాస్టిక్ కవరు వాడుతున్నాం. అందుకే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. అందుకే మనం మార్కెట్‌కి వెళ్లేటపుడు ఓ బ్యాగ్ పట్టుకెళితే సరి. అలాగే చిన్నచిన్న విషయాలు కూలర్ వాడేముందు ఇంట్లో కిటికీ తెరుచుకోవాలి. వృథాగా బల్బులు, ఫ్యానులు వేయకూడదు. బైక్ వాడకాన్ని తగ్గించాలి. దగ్గర్లో పనులకు వాహనం బయటకు తీయకూడదు. పనిచేసే కార్యాలయానికి దగ్గర్లో నివాసం ఉంటే వాహనాన్ని వాడాల్సిన అవసరమే ఉండదు. అలాగే వాహనాన్ని స్నేహితులతో షేర్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. కంపెనీ ఉంటుంది. ఇంకా పబ్లిక్ వాహనాలనే ఎక్కువగా యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే వాషింగ్‌మెషిన్లు వాడే వాళ్లు దుస్తులు అందులోనే డ్రైచేయకుడా బయట ఆరేయాలి.
ఇవేకాదు హైటెక్ యుగంలో తప్పని సరైన కంప్యూటర్ వాడకంలోనూ జాగ్రత్తపాటించాలి. ఒక్క కంప్యూటర్ ఏడాదిలో 78కిలోల కార్బన్‌డైయాక్సైడ్ వెదజల్లుతుందట. అందుకే ఆఫీసులలో కంప్యూటర్ వాడేవాళ్లు దాని అవసరం లేనపుడు స్విచ్ ఆఫ్ చేస్తే సరి. ఇంకా నాణ్యత కలిగిన వస్తువులను ఉపయోగిస్తే ఇంధన వాడకాన్ని తగ్గించినట్టే. వాహనాల టైర్లు, బ్రేకులు, ఇంజిన్ బాగుంటే మైలేజ్ పెరుగుతుంది. పెట్రోలు వినియోగం తగ్గుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతిఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలి. ఒక్క చెట్టుకు 27 కిలోల కాలుష్యాన్ని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ఇలా పౌరులు బాధ్యత వహిస్తే గ్లోబల్‌వార్మింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు.
COMMENTS