A new study found that people who drink tea have a lower risk of dying.
Health tips : చాయ్ తాగితే చావు ప్రమాదం తగ్గుతుంది : కొత్త అధ్యయనం లో వెల్లడి.
భారత సహా ప్రపంచంలో అనేక దేశాల ప్రజలు ఎక్కువగా తీసుకునే పానీయం 'టీ'. రెగ్యులర్‌గానే కాకుండా ప్రత్యేక సందర్భాల్లోనూ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగించడంలో తేనీటికి మించిన ఆయుధం లేదు.
ఇలాంటి హాట్ డ్రింక్ గురించి కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. టీ ఎక్కువగా తీసుకుంటే డెత్ రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. టీ తాగనివారితో పోలిస్తే రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగేవారిలో మరణ ప్రమాదం తక్కువని డేటా విశ్లేషణ స్పష్టం చేసింది.
యూకేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు బ్లాక్ టీ వల్ల కలిగే సంభావ్య మరణాల ప్రయోజనాల గురించి తమ విశ్లేషణలో తెలుసుకున్నారు. రోజుకు రెండు కప్పులకు పైగా టీ తాగే వ్యక్తుల్లో ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తాగని వారికంటే 9% నుంచి 13% వరకు తక్కువని NIH ఒక ప్రకటనలో తెలిపింది. 40 నుండి 69 ఏళ్ల వయసు గల 4,98,043 మంది పురుషులు, స్త్రీలు ఈ అధ్యయనంలో పాల్గొనగా.. వీరిలో 89 శాతం మంది బ్లాక్ టీ వెరైటీని తాగినట్లు చెప్పారు. ఈ స్టడీలో భాగంగా 2006 నుంచి 2010 మధ్యకాలంలో ఒక ప్రశ్నాపత్రానికి సమాధానాలు సేకరించారు. సుమారు 11 ఏళ్ల పాటు ఈ పద్ధతిని అనుసరించగా.. UK నేషనల్ హెల్త్ సర్వీస్ నుంచి లింక్ చేయబడిన డేటాబేస్ నుంచి ఈ మరణ సమాచారం వచ్చింది.
కెఫిన్ జీవక్రియలో జన్యు వైవిధ్యంతో సంబంధం లేకుండా రోజుకు రెండు కప్పులకు పైగా టీ తాగితే తక్కువ మరణ ప్రమాదంతో ముడిపడి ఉంటుంది. మొత్తానికి ఈ పరిశోధనలు టీ అధిక స్థాయిలో తీసుకోవడం కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చని సూచిస్తున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. అయితే ఇక్కడ బ్లాక్ టీ తాగే అలవాటు లేకుంటే పాలు లేదా చక్కెర జోడించినప్పటికీ ఆరోగ్య ప్రయోజనాల్లో గణనీయమైన తగ్గింపు కనిపించలేదు. కాకపోతే చక్కెర, పాలలోని సంతృప్త కొవ్వులను పరిమితం చేయడాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు.
COMMENTS