NABI Recruitment : నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
NABI Recruitment : భారత ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఏబీఐ)లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 సీనియర్ ప్రైవేట్ సెక్రెటరీ, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్, సిస్టం అనలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీతోపాటు ఎంబీఏ,బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హిందీ/ఇంగ్లిష్ భాషలపై మంచి కమాండ్ ఉండాలి. టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. వయసు 35 యేళ్లకు మించకుండా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగినవారు అర్హులు.
రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ 26, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డు కాపీలను డౌన్‌లోడ్ చేసుకుని కార్యాలయ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.
దరఖాస్తు కాపీలను పంపాల్సిన చిరునామా
అడ్రస్:
మేనేజర్ అడ్మినిస్ట్రేషన్,
నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్,
నాలెడ్జ్ సిటీ,
సెక్టార్-81,
మొహాలి-140306,
పంజాబ్,
పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.nabi.res.in.పరిశీలించగలరు.
FOR NOTIFICATION CLICKHERE
FOR WEBSITE CLICKHERE
FOR ONLINE APPLICATION CLICKHERE
COMMENTS