DSSSB Recruitment 2022: దేశ రాజధానిలో 547 టీచింగ్ కొలువులు..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా గ్రూప్‌బీ, గ్రూప్‌సీ విభాగాల్లో మొత్తం 547 పోస్టులను భర్తీ చేయనున్నారు. టీచింగ్, నాన్‌టీచింగ్ కేటగిరీల్లో టీజీటీ, పీజీటీ తోపాటు ఇతర పోస్టులకు కూడా నియామకాలు చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల(ఆగస్టు) 27తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
డీఎస్‌ఎస్‌ఎస్‌బీ
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) ఏటా నియామకాలు చేపడుతుంది. బీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు భారీ సంఖ్యలో ఈ పోస్టులకు పోటీ పడుతుంటారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 547
పోస్టుల వివరాలు: ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(స్పెషల్ ఎడ్యుకేషన్)364; పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్డ్ టీచర్142; నాన్ టీచింగ్41.
అర్హతలు
టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమాతో కూడిన బీఈడీ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఉండాలి.
పీజీటీ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రైనింగ్/ఎడ్యుకేషనల్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఏదైనా హైస్కూల్, కాలేజీలో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు తగిన అర్హతలు ఉండాలి.
ఎంపిక విధానం
పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధార ంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష ఇలా
పీజీటీ: మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. ఇందులో ఆరు విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. అవి.. జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు20 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 ప్రశ్నలు20 మార్కులు, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు20 మార్కులు, హిందీ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు20 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్, టీచింగ్ మెథడాలజీ నుంచి 200 మార్కులకు200 ప్రశ్నలు ఇస్తారు.
టీజీటీ: ఈ పోస్టులకు సంబంధించిన 200 ప్రశ్నలు200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో ఆరు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు20 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 ప్రశ్నలు20 మార్కులు, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 20 ప్రశ్నలు20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు20 మార్కులు, హిందీ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు20 మార్కులు; సంబంధిత సబ్జెక్ట్, టీచింగ్ మెథడాలజీ నుంచి 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇస్తారు.
నెగిటివ్ మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.
ప్రిపరేషన్ ఇలా
ఈ పరీక్ష సిలబస్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పరీక్ష సిలబస్‌ను విశ్లేషించుకొని.. పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. జనరల్ అవేర్‌నెస్ విభాగానికి సంబంధించి ఆరు నుంచి ఎనిమిది నెలల కరెంట్ ఆఫైర్స్ అంశాలపై అవగాన పెంచుకోవాలి. దీనికోసం దినపత్రికలను చదవడం లాభిస్తుంది. విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాలపై ప్రత్యేక∙శ్రద్ధ వహించాలి. లాంగ్వేజెస్‌కు సంబంధించి అభ్యర్థుల భాష నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌లపై లోతైన అవగాహన పెంచుకోవాలి.
ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 27,2022
పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, హిందీ.
WEBSITE: https://dsssb.delhi.gov.in/home/Delhi-Subordinate-Services-Selection-Board
>>>>>>>DSSSB 2022 Notification
COMMENTS