వరలక్ష్మి వ్రతం ఏ విధంగా.. ఏ సమయంలో చేయాలి?
5 వ తారీకు శుక్రవారం అష్టమి తిధి వచ్చింది.. వరలక్ష్మి వ్రతం ఎలాంటి సందేహం లేకుండా అందరు చేసుకోవచ్చు.....
శుక్రవారం ఉదయం పూజ ఎప్పుడు చేసుకోవాలి..
1.బ్రాహ్మీ ముహూర్తం లో అనగా 3 to 4 గంటలకు లేదా 5 to 6 am ఈ సమయం లో మొదలుపెట్టి చేసుకోవాలి.. ఈ సమయం లో చేసేవారు ఉదయం 06 to 07 మధ్యలో రూపు కట్టుకోవాలి.... కొత్త నగలు బట్టలు కట్టుకోవచ్చు.... ఈ సమయం లో చేయలేని వారు...
2..ఉదయం 06 to 07 మధ్యలో మొదలు పెట్టి చేసుకోవాలి ..ఈ సమయం లో శుక్ర హోరా ఉంటుంది..చాలా చాలా మంచిది..ఈ సమయం లో చేసిన వారు 10 to 10.15 am మధ్యలో రూపు కట్టుకోవాలి...
ఈ సమయం లో గురు హోరా ఉంటుంది.. చాలా మంచిది..
నైవేద్యం తేనె, చక్ర పొంగలి, పులిహోర, దదోజనం, పాయసం, బూరెలు, గారెలు, వీటిలో ఏవైనా పెట్టవచ్చు.. ఏమి పెట్టలేనివారు ఆరోగ్యం సహకరించని వారు పాలు తేనె ఖర్జురాలు నివేదించండి..
3.. రాహుకాలం లో అమ్మవారి దేవాలయం లో నిమ్మడోప్పలలో ఆవునెయ్యి వేసి దీపం పెట్టండి..
4.. ఆవులకు అరటిపండ్లు బెల్లం నానబెట్టిన నవధాన్యాలు పెట్టండి..
5.. పూజ చేసే ముందు ఒక బౌల్ లో నవధాన్యాలు ఆవుపాలు వేసి పెట్టండి.. తరువాత వాటిని నానబెట్టి మొక్కలలో చల్లండి..
6.. లక్ష్మీ దీపం అంటే కామాక్షి దీపం.. లేదా కుభేర దీపం లేదా అష్టలక్ష్మి దీపం వెలిగించండి... ఈ దీపం ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి..
7. మీరు ప్రతి సంవత్సరం ఏ విధంగా వ్రతాన్ని ఆచరిస్తారో అదే పద్ధతిలో వ్రతాన్ని ఆచరించండి..
8.. సాయంత్రం ఐశ్వర్య దీపం అనగా ఉప్పు దీపం వెలిగించండి..
9.. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది ఇల్లంతా దీపాలు పెట్టండి బయట గడప దగ్గర దీపాలు పెట్టండి ముగ్గులు వేయండి..
వీలైతే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో మరియు పంచామృతాలతో అభిషేకం చేయండి.. అరగజా,,జవ్వాదు పునుగు,,కస్తూరి ,,జవ్వాదు,, అభిషేకంలో వాడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది..
వీటిని నీటిలో కలిపి ఆ నీటితో అమ్మవారికి అభిషేకం చేయాలి.. అభిషేకం ఉదయం చేయవచ్చు.. ఉదయం కుదరని వారు సాయంత్రం చేయండి..
** ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం చదువుతూ 108 కాయిన్స్ తో పూజ చేయండి.. వెండి పువ్వులు మారేడుదలాలు ఆరావళి కుంకుమ పూజ చేస్తూ మణిద్వీప వర్ణన చదవండి..
** అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు,, లక్ష్మీ గవ్వలు,,గురువింద గింజలు యాలకులు, పచ్చ కర్పూరం తామర గింజలు ,,నల్ల పసుపు కొమ్ములు,,,దక్షిణావృత శంఖం,,ముత్యాలు,, ముత్యపు శంకులు,,వీటి అన్నిటితో పూజ చేస్తూ ఈ క్రింది రెండు మంత్రాలు చదవండి..
"" ఓం ఐం హ్రీం శ్రీo మహాలక్ష్మి దేవ్యై నమః ""..
"""ఓం ఐం కహ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం ""..
ఈ రెండు మంత్రాలు శ్రద్ధతో చదువుతూ వాటన్నిటితో పూజ చేయండి..
8 to9 మధ్యలో ఆవు పిడకని కాల్చి సాంబ్రాణి బొగ్గులం వేసి ధూపం ఇల్లంతా వేయండి..8 to 9 మధ్యలో ఒక పసుపు గుడ్డలో మీరు పూజ చేసిన గోమతి చక్రం,, లక్ష్మీ గవ్వ మూటకట్టి యాలకులు చిల్లర పైసలు కొద్దిగా పచ్చ కర్పూరo వేసి మూట కట్టి ఆ మూటను ధనం దాచుకునే భీరువాలో పెట్టుకోండి అక్కడ కూడా దూపం వేయండి...
ఉదయం 10.30 to 12.30 మధ్యలో మౌనం గా ఉండండి...
ఈ విధంగా పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరు చేసుకుని అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..
*ఓం నమః శివాయ*
COMMENTS