మీ డ్రైవింగ్ శైలి మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతుందని తెలుసా ?
మీరు డ్రైవింగ్ చేసే శైలి మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని మీకు తెలుసా ? మీరు డ్రైవింగ్ చేస్తున్నపుడు బాహ్యవైపున ఎలా ఉంది అనే సంగతి వదిలేస్తే, మీరు స్టీరింగ్ పట్టుకునే విధానం మీ వ్యక్తిత్వాన్ని తేలియజేస్తుందని స్పష్టం అయ్యింది.
చాలా మంది వరకు డ్రైవర్లు స్టీరింగ్‌ను వివిధ రకాలలో పట్టుకుంటారు. డ్రైవర్లకు తెలియకుండానే వివిధ రకాల సంధర్బాలలో స్టీరింగ్‌ను వివిధ రకాల పొజిషన్లలో పట్టుకుంటారు. నేడు కార్ టాక్ విభాగంలో స్టీరింగ్ పట్టుకునే శైలిని బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో క్రింది కథనంలో తెలుసుకుందాం...
1. ది ప్యురిస్ట్
ఈ పద్దతి ప్రకారం గడియారంలో ఉన్న 10 మరియు 2 గంటలన సూచించే స్థానాల ప్రకారం స్టీరింగ్‌ను పట్టుకోవడం పాత పద్దతి. పవర్ స్టీరింగ్ మరియు ఎయిర్ బ్యాగులను పరిచయం చేయకు ముందు ఈ పద్దతిని ఎక్కువ మంది అనుసరించేవారు. అంతే కాకుండా కుడి మరియు ఎడమ వైపులకు స్టీరింగ్‌ను తిప్పాలన్నా ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇలాంటి పద్దతిని మరింత సులభ తరం చేయడానికి వాడుకలోకి వచ్చింది 9 మరియు 3 పాయింట్ల స్థానం.
2.డ్యూడ్
గడియారంలో ఉన్న 12 గంటలను సూచించే స్థానంలో స్టీరింగ్‌ను ఒక్క చేతితో ఉపయోగిస్తే, మీరు ఎంతో నెమ్మదిగిన వారు. ప్రతికూల డ్రైవింగ్ ప్రదేశాలలో కూడా రిలాక్స్‌గా అధిగమిస్తారు. అయితే భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వలేని డ్రైవర్ అనే దానికి ఇది ఏ మాత్రం సరిపోదు.
3. ది మినిమలిస్ట్
దీనికి సింపుల్ అనే పేరు కూడా పెట్టొచ్చు. కుడి చేతితో స్టీరింగ్‌లోని 3 గంటలను సూచించే స్థానాన్ని వినియోగించేవారు ఎంతో సింపుల్‌గా ఉంటారు. అనవసరమైన ఫీట్లను డ్రైవింగ్ సమయంలో చేయడానికి ఏ మాత్రం ఇష్టపడరు.
4.ది డేర్‌డెవిల్
ఒక్క ముక్కలో చెప్పాలంటే స్టీరింగ్‌ను ఇలా పట్టుకునే వారు వారి జీవితం యొక్క చివరి అంచుల్లో బ్రతకాలనుకుంటారు. ప్రతి క్షణాన్ని కూడా రిస్క్‌తో పూర్తి చేసి అనందించాలనే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారి ఏదాని గురించి కూడా రెండవ నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడరు. కుటుంబం కానివ్వండి లేద్ ప్రేమ కానివ్వండి జీవితాన్ని పరిపూర్ణంగా, సంతృప్తిగా మనసుకు నచ్చిన పద్దతిలో జీవించాలని కోరుకుంటారు.
5. క్యాప్టెన్ కూల్
స్టీరింగ్‌ను ఇలా పట్టుకునే వారు ఒక సమూహానికి నాయకుడిలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎంతటి ఉత్కంఠ పరిస్థితుల్లో అయినా అతి వేగంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉండి అత్మివిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఇలాంటి వారికి లీడర్ షిప్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
6. ది సపోర్టర్
ప్రక్కనున్న చిత్రంలో చూపిన విధంగా స్టీరింగ్‌ను పట్టుకునే వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎదుటి వారి విజయాలను కూడా సంతోషంగా స్వీకరిస్తారు. ఇతరులకు మీ సపోర్ట్ విషయంలో రెండవ మాట అంటూ ఏమీ ఉండదు. బంధువులు మరియు మిత్రులు సలహాలు ఇచ్చే సమయంలో శ్రద్దగా వినేవిషయంలో మీరు ఎప్పుడూ ముందుంటారు.
7. రెండు వ్యక్తిత్వలుండే వ్యక్తులు
ఈ విధంగా డ్రైవింగ్ చేసే వ్యక్తులు చాలా వరకు ఎంతో నిశ్శబ్దంగా ఉంటారు మరియు ఎలాంటి అవాంతర వాదనలు చేయరు. చాలా సందర్బాలలో అయితే అన్నింటికి నిశ్శబ్దమే సమాధానం అంటారు. అయితే కొన్ని సంఘటనలలో ఇలాంటి స్వభావాన్ని కోల్పోయి ప్రవర్తిస్తారు. ఎప్పుడో ఒక సారి జరిగే అనుకోని సంఘటనలు మీ కుటుంబాన్ని మరియు మిత్రులను సడెన్‌గా షాక్‌కు గురిచేస్తారు.
8. కమెడియన్
ఇలాంటి పద్దతుల్లో డ్రైవింగ్ చేయడానికి ప్రత్నించే వారికి అచ్చమైన పేరు కమెడియన్. వీరు మిగతా వారికన్నా ఎంతో ప్రత్యేకంగా విభిన్నంగా ఆలోచిస్తారు. ప్రతి సంఘటనను కూడా ఎంతో కూల్‌గా, కామెడీగా తీసుకుంటారు. అందరూ చేసే సర్వసాధారణైన పనులే అయినప్పటికీ ఇలాంటి వారు వాటిని కొత్త పద్దతిలో పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి వారికి క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది.
9. భయబ్రాంతుడు
నాలుగవ స్లైడర్‌లో చెప్పిన వ్యక్తికి ఇతను పూర్తి వ్యతిరేకంగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తులు వారి సౌకర్యాన్ని ఏ మాత్రం వదులుకోరు. ఏదైనా సరే తమ తరువాతే అనే ధోరణిలో ఉంటారు. ఇలాంటి వ్యక్తులు రిస్క్‌లు తీసుకోవడానికి పెద్దగా సాహసించరు, అన్ని కూడా సులభంగా సింపుల్‌గా అయిపోవాలని భావిస్తుంటారు. కాని ఇలాంటి వ్యక్తులను ప్రేమించే వారికి ఇలలో కొదవే లేదు.
10. నాన్సెన్స్‌కు పూర్తిగా వ్యతిరేకం
మీ ప్రయాణంలో మీ సమయాన్ని వృధా చేసే ఎటువంటి అవాంతరాలను కూడా మీరు సహించరు. మిత్రులు లేదా కుటుంబ సభ్యులలో మీరు బాగా నమ్మిన వ్యక్తులతో మీరు కోరుకున్న పనులు పూర్తి చేయిస్తారు. ఇలాంటి వారు లక్ష్య ఛేదనకు ఎక్కువ శ్రద్ద చూపిస్తారు.
COMMENTS