Soybean : సోయాచిక్కుడు సాగులో మేలైన రకాలు…
Soybean : తెలుగు రాష్ట్రాల్లో సోయా చిక్కుడు సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పు జాతి పంటగా సోయాబీన్ ను చెప్పవచ్చు. ఎకరాకు ఎనిమిది నుండి 10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. పంటసాగుతో భూసారం పెరిగే అవకాశం ఉండటంతో రైతులు సోయా చిక్కుడును సాగు చేస్తున్నారు. సాగులో సరైన మెళుకువలు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చు. నూనె గింజల పంట కావటంతో మేలైన విత్తన రకాలను పంటసాగుకు ఎంచుకోవటం మంచిది.
సోయా చిక్కుడు సాగులో రకాలు ;
జె.ఎస్335: దీని కాల పరిమితి 90 రోజులు.మొక్క నిటారుగా మధ్యస్థ ఎత్తులో పెరుగుతుంది.పూత ఊదా రంగులో ఉంటుంది.కాయల పై నూగు ఉండదు.గింజ మధ్యస్థ౦గా ఉంటుంది.మొవ్వుకుళ్ళు తెగులు తట్టుకొంటుంది. మొలక శక్తిని ఎక్కువ కాలం నిలుపుకొంటుంది. దిగుబడి ఎకరానికి 8 నుండి10 క్వింటాళ్ళు.
ఎమ్.ఎ.సి.ఎస్450: దీని కాలపరిమితి 100 రోజులు.మొక్క నిటారుగా ,మధ్యస్త ఎత్తులో పెరుగుతుంది. పూత ఊదా రంగులో ఉంటుంది.కాయ పై రాగి రంగు నూగు ఉంటుంది.గింజ మధ్యస్తంగా ఉంటుంది. ఎకరాకు దిగుబడి 8-10 క్వింటాళ్ళు.
ఎల్.ఎల్.బి.1: అతి తక్కువ కాలంలో అంటే 65 రోజులకే కోత కు వచ్చే రకం.మొక్క పొట్టిగా ఉంటుంది. పూత తెలుపు రంగులో ఉంటుంది.కాయ పై రాగి రంగు నూగు తక్కువగా ఉంటుంది.గింజ లావుగా ఉంటుంది. ప్రత్తి -కంది పైర్లలో అంతర పంటగా అనుకూలమైన రకం. దిగుబడి ఎకరాకు 6 క్వింటాళ్ళు.
ఎమ్.ఎ.సి.ఎస్58: దీని కాలపరిమితి 90-100 రోజులు .మొక్క నిటారుగా 65 సెం.మీ ఎత్తు పెరుగుతుంది.పూత ఊదా రంగులో ఉంటుంది. కాయ పై రాగి రంగు నూగు ఉంటుంది.గింజ మధ్యస్తంగా ఉంటుంది. ఎకరాకు దిగుబడి 8-10 క్వింటాళ్ళు.
పి.కె.1029: 100 నుండి 110 రోజుల పంట కాలం. ఒక ఎకరానికి దిగుబడి 7 నుండి 8 క్వింటాళ్ళు. నిటారుగా మధ్యస్థఎత్తుగా పెరుగుతుంది. కాపు వత్తుగా కాస్తుంది. పూతతెల్లుపు రంగు. త్రుప్పు తెగులును తట్టుకోంటుంది. కాయచిట్లుట తక్కువ.
యల్.యన్.బి.18 : 105 నుండి 110 రోజులపంటకాలం. ఒక ఎకరానికి దిగుబడి 12క్వి. ఖరీఫ్ పంటకు అనుకూలం. ఆకుమచ్చ, తుప్పు తెగులుకుళ్ళు తెగులు మరియు మొజాయిక్ తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగు నుండి కొంత వరకు మరియు ఆకుచుట్టు పురుగు నుండి పూర్తిగా తట్టుకుంటుంది.
జె.యస్.93-05: 90 రోజుల పంటకాలం. ఒక ఎకరానికి దిగునడి 7 నుండి 8క్వి. ఆకులు పొడవుగా ఉంటాయి. ఎండిన తరువాత కాయలు నల్లగా కనిపించును. కాయలపై నూగు ఉండదు. ఒక్కొక్క కాయలో 3-4 గింజలు ఉంటాయి.
యల్.యస్.బి.3: 110 నుండి 115 రోజులు పంట కాలంఎకరానికి దిగుబడి 6 నుండి 7 క్వి, కాయలపై రాగి రంగుసాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా (పియస్.బి) కలిపినీడలోఆరబెట్టి విత్తుకోవాలి . నూగు ఉందును. కాయలు చిట్లుట తక్కువబాక్టీరియా పొక్కు మరియు మొగ్గ మాడుదలను తట్టుకొనును.
ఎ.యస్.బి.22(బాసర): 105 నుండి 110 రోజుల పంట కాలం. ఒక ఎకరానికి 12 నుండి 13 క్వి. ఖరీఫ్ కాలానికి అనివైనది. అధిక దిగుబడినిచ్చు రకం. 8-10 రోజుల ఆలస్యంగా నూర్పిడి చేసిన కాయ చిట్లటం జరగదు.
COMMENTS