Silage : పాతర గడ్డితో గ్రాసం కొరతకు చెక్
Silage : సంవత్సరంలో ఒక్క వేసవిలో తప్ప మిగిలిన కాలాల్లో పచ్చి మేత దొరుకుతుంది. ముఖ్యంగా వర్షా కాలంలో, శీతాకాలంలో పచ్చి మేతలు ఎక్కువగా లభిస్తాయి. అలాంటి సమయంలో రైతులు వశు వులకు కావలసిన దాని కంటే ఎక్కువ మేతను ఉదారంగా పశువుల ముందు వేస్తారు. అలా వేసిన మేతలో అధిక భాగం వృధా అవుతుంది. ఇలా మేతను వృధా చేయకుండా, పుష్కలంగా లభించే మేతను వివిధ వద్ధతుల్లో నిల్వ చేసుకుంటే వేసవిలో కరువు సమయాల్లో అక్కరకు వస్తుంది. మేతను రెండు వద్దతుల్లో నిల్వ చేసుకోవచ్చు. వాటిలో ఒకటి పచ్చి మేతను ఎండు మేతగా మార్చి నిలువ చేసుకోవటం, రెండవది పాతర గడ్డి దీనినే సైలేజ్ గడ్డి తయారీ అంటారు. వీటిలో రైతులకు సైలేజ్ గడ్డి తయారీ కొంత అనుకూలంగా ఉంటుంది. దాని తయారీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
సైలేజ్ తయారి; భూమిలో గుంట తీసి, దానిలో పశుగ్రాసాన్ని నిలువ చేసుకునే పద్ధతిని పాతర గడ్డి తయారీ లేదా సైలేజ్ తయారు చేయటం అంటారు. జొన్న మొక్కజొన్న హైబ్రిడ్ నేపియర్ లాంటి పశుగ్రాసాలు సైలేజ్ తయారీకి అనువుగా ఉంటాయి. తయారు చేసే పద్ధతి విషయానికి వస్తే భూమిలో గుంట తీసి, దానిలో పశుగ్రాసాన్ని నిలువ చేనుకొనే విధానాన్ని పాతర గడ్డి తయారీ లేదా సైలేజ్ తయారీ అంటారు. గుంటను గుండ్రంగా కాని, చతురస్రాకారంలో కాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని పశువులకు, ఎంత కాలానికి మేత అవసరమో దాన్ని బట్టి గుంట పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
సైలేజ్ గడ్డిని ఒక్కొక్క పశువుకు రోజుకు 20 కిలోలు ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఒక రైతుకు 5 పాడి పశువులకు 3 నెలలకు సరిపడా మేతను సైలేజ్ గా తయారు చేసే వద్ధతిని చూద్దాం. ఒక్కొక్క పశువుకు రోజుకు 20 కిలోల సైలేజ్‌ను మేపవచ్చు. ఈ లెక్క ప్రకారం5 పశువులకు, 3 నెలలకు 12,000 కిలోల సైలేజ్ అవసరం అవుతుంది. ఇంత సైలేజ్ తయారీకి 25 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు గల గుంతను తవ్వాలి. నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశంలో ఈ గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ఇటుకలతో పలుచని గోడ నిర్మించి, సిమెంట్ పూత పూస్తే, వర్షపు నీరు లోపలికి చేరకుండా రక్షణగా ఉంటుంది.
సైలేజ్ తయారీకి ఎంచుకున్న పఠుగ్రాసాన్ని వూత దశ వరకు పెరగనివ్వాలి. తర్వాత పశుగ్రాసాన్ని కోసి పాలంలోనే ఎండ బెట్టాలి. తేమ బాగా తగ్గే వరకు లేత ఎండలో ఆరనివ్వాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పశుగ్రాసాన్ని తిప్పుతూ ఉండాలి. పాతర (గుంట) అడుగు, భాగాన, చుట్టూ, సిమెంట్ పూత పూయాలి లేదా కనీసం పాలిథిన్ షీట్ తో లేదా పొడి గడ్డితో కప్పాలి. దీనివల్ల మట్టి పెళ్లలు విరిగి సైలేజ్‌లో కలిసి పాడవ్వకుండా నివారించవచ్చు.ఎండిన మేతను చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన మేతను పాతరలో నింపాలి. ఇలా నింపేటప్పుడు గాలి లేకుందా జాగ్రత్త తీసుకోవాలి. ఉదయపు వేళ ఈ పని ప్రారంభించటం మంచిది. గుంటలో పొరలు పొరలుగా మేత పేరుస్తూ, గాలి చేరకుండా. అదుముతూ ఉండాలి. గాలి చేరితే మేత బూజు వట్టి చెడిపోతుంది.
గుంట పైభాగంలో అర్ధ చంద్రాకారం వచ్చే వరకు నింపి, దాని పైన పాలిథిన్ పేపర్ తో కాని, గడ్డితో కాని మూసి, దాని పైన 10-15 సెం.మీ మందంలో మట్టిని కప్పాలి. ఆ మట్టి పైన పేడతో అలికితే రంధ్రాలు పూడుకుపోయి మరింత రక్షణగా ఉంటుంది.
పాతరలోని గడ్డి 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా ఉంటుంది. వాడకానికి గుంతను తెరేటప్పుడు మొత్తం తెరవకుండా, ఒక మూల కొద్దిగాతెరవి వాడుకుంటూ, మళ్లీ మూసి వేస్తూ ఉండాలి. గుంతను ఒకసారి తెరిస్తే నెల రోజుల్లో పూర్తిగా వాడెయ్యాలి. పాలిచ్చే
పశువులకు సైలేజ్‌ను పాలు పితికిన తర్వాత లేదా పాలు పితకటానికి 4 గంటల ముందు మేపాలి. లేకపోతే పాలు సైలేజ్ వాసనను కలిగి ఉంటాయి.
COMMENTS