Redgrum: The best seed varieties for horticulture

 Redgrum : కందిసాగులో మేలైన విత్తన రకాలు

Redgrum : పప్పుదినుసులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ డిమాండ్ అధికంగా ఉటుంది. వాటిల్లో కంది ఒకటి. దేశంలో మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రధానంగా కంది ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కందిపంట సాగవుతుంది. ప్రత్తి,మిరప పోగాకులకు ప్రత్యామ్నాయ౦గా అలాగే పెసర,మినుము,సోయాచిక్కుడు,వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్ తో పండించవచ్చు.కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగుచేస్తుంటారు. కందిని రబీ లో కూడా పండించవచ్చు.

నీరు త్వరగా ఇంకిపోయే గరప,ఏఱ రేగడి,చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు.చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికి రావు. భూమిని రెండు సార్లు నాగళ్ళతో దున్ని మెత్తగా తయారు చేయాలి.విత్తన మోతాదుకు సంబంధించి ఖరీఫ్ లో సహపంటగా 2-3 కిలోలు, రబీలో ఎకపంటగా/సహపంటగా 6-8కిలోలు సరిపోతుంది. అంతర పంటగా కంది సాగు చేయాల్సి వస్తే నిష్పత్తి కంది, వేరుశనగ (1:7)1.5కిలోలు ఎకరాకు, కంది, మొక్కజొన్న(1:2) 2-3కిలోలు ఎకరాకు సరిపోతుంది.

ఖరిఫ్ లో ఉత్తర తెలంగాణా,దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ లోను, కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం మరియు ఉత్తర కొస్తా మండలాల్లో జూన్-జూలై నెలల్లోను, రబీలో ఉత్తర,దక్షిణ తెలంగాణాల్లో సెప్టెంబరు లోను,కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం,ఉత్తర కొస్తా మండలాల్లో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోను విత్తుకోవచ్చు. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. నాగలి వెంబడి గాని ,సాళ్లలో గోర్రుతో గాని విత్తుకోవాలి. ఖరిఫ్ లో నల్ల రేగడి నేలల్లో 150 X 12లేదా 180 X 10సెం.మీ(వరసుల మధ్య మొక్కల మధ్య),ఎర్ర నేలల్లో 90 X 20 సెం.మీ రబీలో వర్షాధారంగా 45-60 X 10,ఆరుతడి పంటగా 75-90 X 10సెం.మీ. ఎడం ఉండేలా చూడాలి.

కందిలో విత్తన రకాలు ;

పల్నాడు(ఎల్.ఆర్.జి.30); మొక్క గుబురుగా పెరిగి కాపు మీద ప్రక్కలకు వాలి పోతుంది.పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి.గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి.మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనువైన రకం .రబీకి కూడా అనుకూలం.ఎండు,వెర్రి తెగుళ్ళను తట్టుకోలేదు. ఖరిఫ్:170-180, రబీ:120-130 రోజుల పంటకాలం. ఎకారానికి 8.8-10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

మారుతి(ఐ.సి.పి.8863) ; మొక్క నిటారుగా పెరుగుతుంది.ఎండు తెగులను తట్టుకొంటుంది.గింజలి మధ్యస్థలాపుగా ఉంటాయి. వారి మాగాణి గట్ల మీద పెంచటానికి అనువైనది. ఖరిఫ్ 155-160 రోజుల పంటకాలం. ఎకరానికి 8క్వింటాళ్ళ పంట దిగుబడి వస్తుంది.

అభయ(ఐ.సి.పి.ఎల్.332) ; మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి.గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో వుంటాయి. కాయ తొలుచు పురుగును కొంతవరకు తట్టు కొంటుంది. ఖరిఫ్:160-165 రోజుల పంటకాలం. ఎకరానికి 9క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది.

లక్ష్మి(ఐ.సి.పి.ఎల్.85063) ; చెట్లు గుబురుగా వుండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి.ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.రబీ లో విత్తినపుడు,ప్రధానమైన కొమ్మలు ఎక్కువగా ఉండి,ఎక్కువ దిగుబడి నిస్తుంది.గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఖరిఫ్/రబీ160-180 రోజుల పంటకాలం. ఎకరానికి 7 నుండి 8 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

ఆశ(ఐ.సి.పి.ఎల్.87119) ; మొక్క నిటారుగా,గుబురుగా పెరుగుతుంది.ఎండు మరియు వెర్రి తెగుళ్లను తట్టు కొంటుంది.గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. ఖరిఫ్:170-180 రోజుల పంటకాలం. ఎకరానికి 8క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

(హెచ్.వై.3సి) ; మొక్క నిటారుగా,గుబురుగా పెరుగుతుంది.ఎండు మరియు వెర్రి తెగుళ్లను తట్టు కొంటుంది.గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయిఎర్ర పూత వుండి,కాయలు వెడల్పుగా వుంటాయి.ఖరీఫ్ గింజలు తెలుపు.పచ్చి గింజలను కూరగా ఉపయోగించవచ్చు. ఖరిఫ్:190-200 రోజుల పంటకాలం. ఎకరానికి 8 క్వింటాళ్ళ నుండి 9 క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుంది.

యం.ఆర్.జి.66 ; మొక్క నిటారుగా,గుబురుగా పెరుగుతుంది.ఎండు మరియు వెర్రి తెగుళ్లను తట్టు కొంటుంది.గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయిఎర్ర పూత వుండి,కాయలు వెడల్పుగా వుంటాయి.ఖరీఫ్ గింజలు తెలుపు.పచ్చి గింజలను కూరగా ఉపయోగించవచ్చు.ఖరిఫ్:180 రోజుల పంటకాలం. ఎకరానికి 8 నుండి 9క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

ఎల్.ఆర్.జి-38 ; మొక్కలు ఎత్తుగా,గుబురుగా 120-130 రబీ పెరుగుతాయి.పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. తొలకరి,రబీ కూడా అనుకూలం. ఖరిఫ్:180, రబీ:120-130 రోజుల పంటకాలం. ఎకరానికి 8 నుండి 10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

డబ్ల్యు.ఆర్.జి-27 ; మొక్కలు ఎత్తుగా పెర్గుతాయి.పువ్వులు ఎరుపుగా ఉంటాయి.కాయలు ఆకుపచ్చగా ముదురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి.గింజలు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఖరిఫ్:180, రబీ:120-130 రోజుల పంటకాలం. ఎకరానికి 8 నుండి 9 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

దుర్గా ; అధిక దిగుబడినిచ్చే స్వల్ప కాలిక రకం,కాయతొలుచు పురుగు బారి నుండి తప్పించుకొంటు౦ది.ఉత్తర తెలంగాణా జిల్లాలకు ఖరిఫ్ పంటగా అనువైనది. ఖరిఫ్:115-125 రోజుల పంటకాలం. ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

పి.ఆర్.జి-100 ; ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.తెలంగాణా మరియు రాయల సీమలోని తేలిక పాటి,ఎర్ర చల్కా నేలల్లో వర్షాధారంగా సాగుచేయటానికి అనువైనది. ఖరిఫ్:145-150 రోజుల పంటకాలం. ఎకరానికి 8 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది.

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post