Quail Birds : లాభసాటి అదాయం…. కౌజు పిట్టల పెంపకం.
Quail Birds : కరోనాతో మనిషి ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. పోషకాలు ఎక్కవగా ఉండే అహారాన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో మాంసం ఉత్పత్తులకు మంచి గిరాకీ పెరిగింది. ప్రధానంగా పోషకాలను అధికంగా కలిగిన కౌజు పిట్టల మాంసాన్ని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో కౌజు పిట్టల పెంపకం మంచి లాభసాటిగా మారింది. మాసంతోపాటు, గుడ్లను విక్రయిస్తూ మంచి అదాయం పొందేందుకు అవకాశం ఉంది.
కౌజు పిట్లల పెంపకానికి కొద్దిపాటి స్ధలం ఉంటే సరిపోతుంది. పెట్టుబడి కూడా స్వల్పం కావటంతో వీటి పెంపకం కూడా సులభంగానే ఉంటుంది. 10 చదరపు అడుగుల స్ధలం ఉంటే చాలు 100 కౌజుపిట్టలను పెంచుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలల్లోని నిరుద్యోగ యువకులకు వీటి పెంపకం అనుకూలం. వీటికి వచ్చే వ్యాధులు సౌతం తక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల వ్యాక్సిన్ల వంటి వాటితో పని ఉండదు.
కోళ్ళకు అందించే దాణాతోపాటు, శుద్ధమైన త్రాగునీరు అందిస్తే సరిపోతుంది. 4నుండి 5వారాల్లో 250 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. ఈ కాలంలో ఒక్కో పిట్ట 500 గ్రాముల వరకు తీసుకుంటుంది. దాణాకోసం 15రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కో కౌజు పిట్టను 5వారాలపాటు పెంచేందుకు 26 రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం హోల్ సెల్ వ్యాపారులకు ఒక్కో కౌజు పిట్టను 50 రూపాయలకు విక్రయించవచ్చు. వీటి గ్రుడ్లను అమ్మటం ద్వారా అదాయం పొందవచ్చు.
కౌజు పిట్టల పెంపకం చేపట్టాలనుకునే వారు వారానికి ఒక బ్యాచ్ వచ్చేలా షెడ్లును నిర్మించుకుని వాటిని విభాగాలు చేసుకోవాలి. నాలుగు బ్యాచ్ లుగా చేసుకుని ఒక్కో బ్యాచ్ లో 500 పక్షులు పెంచుకుంటే నెలకు ఖర్చులు పోను 2000 పక్షులపై 48వేల రూపాయల వరకు అదాయం పొంద వచ్చు. ఇక గ్రుడ్ల ద్వారా వచ్చే అదాయాన్ని కూడా కలుపుకుంటే ఆమొత్తం ఇంకా ఎక్కువగానే ఉంటుంది.
కౌజు పిట్టల పెంపకం చేపట్టాలనుకునే వారు ముందుగా మార్కెట్ పై స్టడీ చేయటం అవసరం. గుడ్లు, మాంసానికి ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. పెంపకం కోసం పదేపదే పక్షులను కొనుగోలు చేయకుండా ఒక బ్యాచ్ ని కొనసాగానే వాటి నుండి వచ్చే గుడ్లను పొదిగించి బ్రీడర్స్ ను తయారు చేసుకోవటం వల్ల పక్షుల కోసం తిరిగి ఎవరి వద్దకో వెళ్ళాల్సిన పని ఉండదు.
తక్కువ కాల వ్యవధిలో ఎక్కవ లాభాలు సంపాదించాలనుకునే వారికి కౌజు పిట్టల బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. చికెన్ లో కన్నా ఎక్కవ ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఇందులో లభిస్తుండటంతో ఇటీవలికాలంలో ఈ కౌజు పిట్ల మాంసానికి బాగా గిరాకీ పెరిగింది. హోటళ్ళు, రెస్టారెంట్లలో స్పెషల్ కౌజు పిట్టల మాసం లభిస్తుండటంతో వీటి పెంపకం దారులు ప్రస్తుతం లాభాలబాట పడుతున్నారు. కౌజు పిట్టల బీడర్స్ ను ప్రస్తుతం హైద్రబాద్ లోని రాజేంద్రనగర్ పశువైద్య కళాశాలలో అందిస్తున్నారు. అయితే అవి కావాలనుకునే వారు 2నెలల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి పెంపకం చేపట్టాలనుకునే వారు ముందు 200 పక్షులతో ప్రారంభించి తరువాత పెంచుకోవటం ఉత్తమం.
COMMENTS