Polyhouse : పాలిహౌస్ సాగులో నులిపురుగుల సమస్య
Polyhouse : ఇటీవలికాలంలో పాలిహౌస్ విధానంలో సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.. పాలిహస్ లో పెంపకానికి అనువైన పూల మొక్కలు, కార్నేషన్, జర్చిరా , గులాణ, కూరగాయ పంటలైన టమాట, మిరప, కూరమిరప, కీర వంటి పంటలను వాణిజ్యపరంగా సాగుచేసి అధిక దిగుబడులను, ఆదాయాన్ని రైతులు పొందుతున్నారు. ప్రభుత్వం కూడా పాలిహౌసి సాగుకు రైతులకు ఎన్నో రాయికీలను ఇస్తూ సాగు విస్తీర్ణం పెంచే విధంగా ప్రోత్సహిస్తుంది. అయితే పాలీహాఫి సాగు ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా సస్యరక్షణ విషయంలో పాలీహౌస్ సాగులో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పాలీవౌస్ పూలు,కూరగాయల సాగులో నులిపురుగుల సమస్య అధికంగా ఉంది. పాలీవౌస్ బెద్స్లో మట్టి మిశ్రమం నిరంతరం ఎక్కువ తేమను కలిగి ఉంటుంది. నీడ ఉండడంతో నులిపురుగుల పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడి 90 శాతం వరకు దిగుబడిని తగ్గిస్తున్నాయి. నులిపురుగులు ఆశించిన పంటలో అకులు పనుపు రంగుకు మారతాయి. అకులు ఎండి రాలిపోతాయి. మొక్కల ఎదుగుదల లోపించి పూత, పిందెకు రాకపోవడం జరుగుతుంది. కొద్ది కాలంలో బెడ్స్ అంతా వ్యాపించి అన్ని మొక్కలు వదలి ఎండిపోవడం చూడవచ్చు. వడలిన మొక్కలు పీకి చూసినట్లయితే, పూనలు బుడిపెల మాదిరిగా ఎత్తైన , ఉబ్బిన ప్రాంతాలు, వేరు వ్యవస్ధలో వృద్ధి చెందుతాయి. నీటి ఎద్దడికి గురైన పంట లక్షణాలను పోలి ఉంటుంది.
యాజమాన్యం ;
బెడ్స్ వేసే సమయంలో నేలను స్టెరిలైజ్, సూక్ష్మీకరించటం చేయాలి. కార్బోఫ్యూరాన్ గుళికలు చల్లాలి. బెడ్స్ పై తగిన తేమ ఉండేలా చూడాలి. జీవన ఎరువుల్లో కలిపిన , పశువుల ఎరువు, వానపాముల ఎరువు, వేప పిండిని మొక్కలు వేయకముందే బెడ్స్ పై వేయాలి. పంట వేసే ముందు బంతి పంటను వేయటం దానిని కలియదున్ని బెడ్స్ తయారు చేసుకోవాలి. నూనె తీసిన వేపచెక్కకు 4కిలోల పాసిలోమైసిస్ లిలాసియమ్, 4కిలోల ట్రైకోడెర్మా విరిడి, 4కిలోల సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కలపాలి. 20రోజుల తరువాత ఈ మిశ్రామాన్ని పాలీహౌస్ బెడ్స్ పై పశువుల ఎరువుతో కలిపి వేయాలి.
COMMENTS