Onion Cultivation : ఉల్లి సాగులో యాజమాన్య పద్ధతులు
Onion Cultivation : సుగంధ ద్రవ్యాల్లో ఉల్లిగడ్డ ఒకటి.. తినే పదార్థాలకు రుచి కల్పించడానికి గాను వాడేవాటిలో ఉల్లి కూడా ఒకటి. ఇటీవలి కాలంలో ఉల్లికి మార్కెట్లో మంచి ధరలభిస్తుంది. దీంతో రైతుకు మంచి అదాయాన్నిచ్చే పంటగా మారింది. దీనిని తెలుగు రాష్ట్రాల్లో విసృతంగా సాగుచేయబడుతుంది. దీని ద్వారా రైతులకు అధిక అదాయం పొందుతున్నారు.
సాగుకు అనువైన ఉల్లి రకాలు; ఎర్ర ఉల్లి రకానికి సంబంధించి బళ్ళారి రెడ్, నాసిక్ రెడ్, పూసా రెడ్, అగ్రి ఫొండ్ లైట్ రెడ్, అర్మకళ్యాణ్, అర్మ ప్రగతి, అర్మ బిందు, అగ్రి ఫొండ్ రెడ్ లైట్ రెడ్, అర నికేతన్ రకాలు రైతులు సాగు చేయవచ్చు. పసుపు ఉల్లి రకానికి సంబంధించి ఎర్లీ గ్రానో, అర్క పీతాంబర్ రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. తెల్ల ఉల్లి రకానికి సంబంధించి పూసా వైట్ స్వాట్, అగ్రి ఫొండ్ వైట్ వంటి రకాలు సాగుకు అనుకూలం. సాంబారు ఉల్లి రకానికి సంబంధించి బెంగుళూర్ రోజ్, అగ్రి ఫాండ్ రోజ్, కో-1,4 అందుబాటులో ఉన్నాయి. ఎరుపు హైబ్రర్స్ రకానికి సంబంధించి అర్భలాలిమ, అర్క కీర్తిమాన్ విత్తనరకాలు లభిస్తున్నాయి.
తెల్ల ఉల్లిలోకన్నా ఎర్ర ఉల్లిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 8-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఖరీఫ్‌లో జూన్,జూలైలో నారు పోసి ఆగష్టు మొదటి పక్షంలో నాటాలి. రబీలో అక్టోబరు రెండో పక్షంలో నారు పోసి డిసెంబరు మొదటి వారంలో, వేసవి పంటగా జనవరిలో నాటాలి. నాటేదూరం 15:10 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి. ఆఖరు దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 250.కిలోల వేపపిండి, జీవన ఎరువులైన అజటోబాక్టర్ 2 కిలోలు, ఫాస్ఫో బాక్టీరియా 2 కిలోలు వేసి నాటీ ముందు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ 20-32 కిలోల భాస్వరం వేయాలి. నాటిన 30, 45 రోజులకు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్ చొప్పున వేయాలి. మొక్కలు పెరిగే దశలో 60 రోజుల వరకు 12-15 రోజులు వ్యవధిలో, గడ్డ ఊరే దశలో 5-6 రోజులకోతడివ్వాలి. కోతకు 15 రోజుల ముందు నీరివ్వడం ఆపాలి.
ఉల్లిలో సస్యరక్షణ;
తామర పురుగులు : ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. దానితోబాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగు. మచ్చలు. కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు
ఫిప్రోనిల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో రెండు మూడుసార్ను పిచికారి చేయాలి.
ఆకు తినే పచ్చపురుగు : నివారణకు కార్బరిల్ ౩ గ్రా. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లేదా ప్రాఫెనోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
ఆకు మచ్చతెగులు : ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనవుడు తెగులు ఉదృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 3 గ్రా. మాంకోజెబ్ లేదా క్లోరోధాలోనిల్ 25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కలువునివారణ: నారు నాటిన రెండో రోజు పెండిమిథాలిన్ 12 లీ/200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారి చేయాలి. కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్ హైడ్రాజైడ్ పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తటం తగ్గుతుంది.
నీటి యాజమాన్యం : నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధితో 4-5 తడులు ఇవ్వాలి. గడ్డ వూరే దశలో 6-7 రోజుల వ్యవధిలో 7-8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు కట్టటం ఆపాలి.
పంటకోత మరియు ఆరబెట్టడం : గడ్డలు పీకడానికి ముందు నీళ్ళు కట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను, గడ్డకు 2.5 సెం.మీ. కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తరువాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50 శాతం ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు. క్యూరింగ్ వలన పొర రంగు అభివృద్ధి చెందుతుంది. 3-4 రోజులు పాలం మీదే ఎండబెట్టి తర్వాత 10-12 రోజులు నీడలో ఎండబెట్టి ఆ తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఖరీఫ్ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండనందువల్ల ‘సూర్యరళ్మి ద్వారా క్యూరింగ్ చేయవచ్చు. పరిపక్వం కాని చిన్న చిన్న పాయలను ఎపుడూ నిల్వ ఉంచరాదు. సుమారు 4-6 సెంమీ. ఆకారం కలిగిన మధ్యస్థమైన పాయలు, మంచి నిల్వ గుణం కలిగి ఉంటాయి. ఎకరాకు ఖరీఫ్‌లో 80-100 క్వింటాళ్ళు రవీలో 120-140 క్వింటాళ్ళు చొప్పున దిగుబడినిస్తుంది.
COMMENTS