Onion Cultivation : ఉల్లిసాగులో.. మెళుకువలు
Onion Cultivation : కూరగాయ పంట ఉల్లి. రోజూ ఇంట్లో ఉపయోగించే నిత్యావసర సరుకు. ఏ కూర వండలన్నా ఉల్లిపాయ వేయాల్సిందే. దీంతో ఉల్లిపాయ అనేది నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఖరీఫ్ సీజన్‌లో ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. జూన్ లేదా జులై నుంచి మొదలుపెట్టి నవంబర్ వరకు పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఉల్లిని పండిస్తారు. గుండెజబ్బుకి దివ్యఔషధంగా , శరిరంలో కొలెష్ట్రాల్ ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది,అందుకే తల్లి చేయలేని మేలు ఉల్లి చేస్తుందంటారు .
ఉల్లి మూడు కాలాల్లో సాగుచేయవచ్చు ఖరీఫ్ లో జూన్,జులై నుండి అక్టోబర్-నవంబర్ వరకు , రబీ కాలంలో నవంబర్,డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు సాగుచేస్తారు . వేసవి పంటగా అయితే జనవరి,ఫిబ్రవరి నెలలో నాటవచ్చు వాతవరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాల్లో ఎదుగుదల బాగుంటుంది .
నీరు నిలువని సారవంతమైన మెరక నేలలు అనుకూలం .ఉప్పు , చౌడు , క్షారత్వం మరియు నీరు నిలువ ఉండే నేలలు పనికిరావు. ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంచేందుకు నేలను బాగా దున్ని120 సెం, మీ వెడల్పు ,3 మీ పోడవుగల ఎత్తైన నారుమళ్లను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చ .మీ .ల నారు మడిలో పెంచిన నారు ఒక ఎకరాలో నాటడానికి సరిపొతుంది
నారు నాటడానికి 2-3 సార్లు దుక్కి దున్నిన పొలాన్ని చదును చేయాలి . బోదెలు 30 సెం .మీ ఎడంలో చేసి బోదెకు రెండు వైపులా నాటుకోవాలి. నారుపోసుకునె ముందు విత్తనశుద్ది చేసుకోవాలి , కిలో విత్తనాన్ని 3 గ్రా . కాప్టాన్ /థైరం ను కలిపి నారు మడిలో విత్తనాన్ని పలుచగా వరుసల్లో పోయాలి. సుమారు 30-45 రోజుల వయసు గల నారు నాటుటకు అనుకూలంగా ఉంటుంది . నారును 1% బోర్డో మిశ్రమంలొ ముంచి నాటడం వల్ల నారు కుళ్ళు సోకకుండా ఉంటుంది
కలుపు నివారణ మరియు ఎరువుల యాజమాన్యం :
ఉల్లి నారు నాటిన 2,3 రోజుల్లో తేమ ఉన్నపుడు ఆక్సిఫ్లోరొఫిన్ 23.5% 200 మి.లి ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 30,45 రోజుల మధ్య మరల కలుపుతీసి మట్టిని ఎగదోయాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 60-80 కిలోల నత్రజని , 24-32 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి . నత్రజని రెండు ధఫాలుగా అంటే నాటినపుడు మరియు నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి నత్రజనితో పాటు , పొటాష్ ను కూడా రెండు ధఫాలుగా వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవదిలో 4-5 తడులు ఇవ్వాలి .గడ్డ ఊరే దశలో 6-7 రోజుల వ్యవదిలో 7-8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు కట్టుట ఆపాలి
బళ్లారిరెడ్, రాంపూర్‌రెడ్, వైట్ ఆనియన్, పూసారెడ్, అర్కనికేతన్, అర్కకళ్యాణ్, అర్కప్రగతి, కళ్యాణ్‌పూర్, రెడ్‌రౌండ్, ఎన్-53, అగ్రిఫౌండ్ లైట్‌రెడ్, అగ్రిఫౌండ్ డార్క్‌రెడ్, తెలుపు రకాలైన పూసావైట్ రౌండ్,పూసావైట్‌ఫ్లాట్ వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.
సస్యరక్షణ చర్యలు :
తామర పురుగులు : ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి ఆకులపై , కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి . వీటి నివారణకు డైమిథోయెట్ లేదంటే ఫిప్రొనిల్ 2 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి . తామర పురుగులకు ఆశ్రయమిచ్చె వెల్లులి . క్యాబేజి ,టమట , దోస వంటి పంటలను సాగు చేయరాదు .
బల్బ్ మైట్ నల్లి : ఈ నల్లి ఆశించిన ఉల్లి గడ్ద పెరుగుదల ఆగిపోయి కుళ్ళిపోతాయి పురుగు సోకిన గడ్దల నుండి ప్రక్కనున్న ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తుంది . వీటి నివారణకు స్పైరో మెసిఫిన్ 0.75 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఆకుమచ్చ తెగులు : వాతావరణంలో తేమ ఎకువైనపుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది . ఈ తెగులు ఆశించడం వలన ఆకులపై . ఊదారంగు మచ్చలు ఏర్పడి . ఆకులు ఏండిపోతాయి దీని నివారణకు కార్బండిజం మరియు మాంకోజెబ్ కలిపిన మందును 2 గ్రా . చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఉల్లి పంటను ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయాలి. ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలింధ్రాలు నాశనం చేయబడతాయి. తామర పురుగు నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని చల్లాలి పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేప గింజల ద్రావణాన్ని పిచికారి చేయాలి. కోతకు 10 రోజుల ముందుగా నీళ్ళు కట్టడం ఆపేయాలి . గడ్డకు 2.5 సెం .మీ.కాడ ఉంచి కోయాలి. గడ్డలు తవ్విన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి . 50% ఆకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిలువ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
COMMENTS