Onion Cultivation : ఉల్లిసాగులో నారుమడి పెంపకం, జాగ్రత్తలు
Onion Cultivation : భారతీయుల ఆహారంలో ఉల్లికి ప్రముఖస్ధానం ఉంది. ఎన్నో ఔషదగుణాలు ఉన్న ఉల్లిలో పోషక విలువలు అధికంగానే ఉన్నాయి. ఇటీవలికాలంలో రైతులు ఉల్లిసాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో ఉల్లిసాగులో రైతులు కొన్ని సూచనలు , సలహాలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. నీరు నిల్వని సారవంతమైన మెరక నేలలు ఉల్లిసాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉప్పు, చౌడు, క్షారత్వం , నీరు నిల్వ ఉండేనేలలు ఉల్లిసాగుకు పనికిరావు.
ఉల్లిసాగు ఖరీఫ్ సీజన్లో జూన్ , జులై నుండి అక్టోబరు,నవంబరు వరకు సాగు చేయవచ్చు. రభీ సీజనులో నవంబరు చివరి నుండి ఏప్రిల్ వరకు సాగు చేసుకోవచ్చు. వేసవి పంటగా సాగు చేయాలనుకునేవారు జనవరి, ఫ్రిబవరి మాసాల్లో నాటుకోవచ్చు. ఉల్లిని తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. నీరు ఇంకిపోయే తేలికపాటి నేలల్లో ఉల్లిసాగుచేస్తే అధిక దిగుబడులను పొందవచ్చు.
ఉల్లిపంట వేయాలనుకునే రైతులు ముందుగా నారుమడులు సిద్ధం చేసుకుని ఉల్లినారు పెంచుకోవాలి. నారు మడుల పెంచుకునేందుకు రెండు రకాల పద్దతులు ఉన్నాయి. చిన్నచిన్న మడులలో నాటుకునే పద్దతి ఒకటి కాగా, రెండవది ఎత్తైన బెడ్లలో డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ద్వారా పండించవచ్చు. ఎకరానికి మూడు నుండి కాలుకిలోల విత్తనం అవరమౌతుంది. ముందుగా కాప్టాన్ కాని ఆక్సీక్లోరైడ్ కిలోకి 3గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఉల్లిసాగుకు కోసం సాధారణంగా రైతులు వివిధ రకాల విత్తనాలను వినియోగిస్తుంటారు. వాటిలో బళ్ళారి రెడ్, రాంపూర్ రెడ్, వైట్ ఆనియన్, పూసారెడ్, అర్కని కేతన్, అర్క కల్యాణ్, అర్క ప్రగతి, కల్యాణ్ పూర్, రెడ్ రౌండ్, ఎన్ 53, అగ్రి ఫౌండ్ లైట్ రెడ్, అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్, పూసా వైట్ రౌండ్, పైసా వైట్ ప్లాట్ వెరైటీలను ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ ను బట్టి రైతులు ఉల్లి రకాలను సాగుచేస్తుంటారు.
నారు పెంచే సమయంలో 10రోజుల కొకసారి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారి చేసుకోవాలి. దీని వల్ల నారుకుళ్ళు తెగులు సోకకుండా ఉంటుంది. నారు పెరుగుదల దశలో రసం పీల్చే పురుగు ఆశించకుండా కార్పోప్యూరాన్ 3జీ గుళికలు నారుమడిలో చల్లి నీరు పెట్టాలి. నారు నాటే ముందు ప్లుక్లోరాలిన్ 45శాతం ఎకరానికి ఒకలీటరు చొప్పున పిచికారీ చేసి భూమి మొత్తాన్ని కలియదున్నాలి.
COMMENTS