Lipstick Seeds : మన్యంలో రంగుల పంట..రైతులకు లాభదాయకంగా లిప్‌స్టిక్ గింజల సాగు
Lipstick Seeds : మగువల అందాల పెదవులకు మరింత అందాన్ని తెస్తుంది లిప్‌స్టిక్. లిప్ స్టిక్ వేసుకుంటే అమ్మాయిల పెదాలు ఎర్రగా నిగనిగలాడతాయి. మరి ఈ లిప్‌స్టిక్ ను దేంతో తయారు చేస్తారు? లిప్‌స్టిక్ కు ఎర్రటి రంగు రావటానికి ఏం వాడతారు?అనే డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా?అంటే కాస్త ఆలోచించాల్సిందే. లిప్‌స్టిక్ కు ఎర్రటి రంగు రావటానికి ఓ రకమైన గింజల్ని ఉపయోగిస్తారు. ఎర్రగా కనిపించే ఈ గింజల వల్లే లిప్ స్టిక్ కు ఆ రంగు వస్తుందట. అవే ‘జాఫ్రా గింజలు’. ఈ జాఫ్రా గింజల్ని మన ఏపీలోని ఏజెన్సీ ఏరియాలో ఓ రైతు పండిస్తున్నాడు. ఒక్కసారి నాటితే 25 ఏళ్ల వరకు దిగుబడి వచ్చే ఈ జాఫ్రా గింజల పంటను మూడెకరాల్లో పండిస్తున్నాడు మడకం జంపాలరావు అనే గిరిజన రైతు. మరి ఈ జాఫ్రా గింజల్ని ఎలా పండిస్తారు? ఎన్నాళ్లకుఈ పంట చేతికొస్తుంది? అనే విషయాలు తెలుసుకుందాం.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో లిప్‌స్టిక్ గింజలుగా పేరొందిన జాఫ్రా పంట సాగు మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే చక్కటి దిగుబడి సాధించాడు బుట్టాయగూడెం మండలం దాసయ్యపాలెంకు చెందిన మడకం జంపాలరావు. గత 30 ఏళ్లుగా 100 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగుచేస్తున్నన జంపాలరావు జాఫ్రా పంట గురించి తెలుసుకున్నాడు. కొత్త పంటలు పండించాలనే ఆసక్తి కలిగిన జంపాలరావు ఇటీవల విశాఖ మన్య ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఈ జాఫ్రా పంట గురించి తెలుసుకున్నాడు. ఆ పంటతాను కూడా పండించాలని నిర్ణయించుకున్నాడు. అంతే అనుకున్నదే తడవుగా మూడు ఎకరాల్లో జాఫ్రా పంట వేశాడు. సాధారణంగా జాఫ్రా పంట 14 నెలలకు చేతికొస్తుంది.కానీ జంపాలరావు మాత్రం 14నెలలకు చేతికి వచ్చే పంటను కేవలం 9 నెలలకే చేతికొచ్చేలా పండించటం విశేషం. దిగుబడి సాధించాడు.
ఎకరాకు 160 మొక్కల చొప్పున,[object Object],రంపచోడవరం నుంచి మొక్కలను తీసుకువచ్చి ఎకరాకు 160 చొప్పున మూడెకరాల్లో నాటాడు ఆ రైతు. మొక్కల ఎదుగుదల ఆశాజనకంగా కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
జాఫ్రా గురించి మరిన్ని విశేషాలు..
జాఫ్రా మొక్కలు అంటే చాలా మందికి తెలియదు. లిప్‌స్టిక్ మొక్కలు అంటేనే ఠక్కున గుర్తుపడతారు. జాఫ్రా మొక్కలు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి.బాగా ముదిరిన తర్వాత కోస్తే వాటి నుంచి ఎర్రటి గింజలు వస్తాయి.ఈ గింజల నుంచి సహజ ఎరుపు,నారింజ రంగుల్ని వేరు చేసి లిప్ స్టిక్ తయారీలో వాడుతున్నారు.ఇతర సౌందర్య సాధనాల్లోను ఉపయోగించడం కూడా ఇటీవల పెరిగింది.అంతే కాదు ఈ రంగు వేడిని తట్టుకుని కరిగి పోకుండా ఉండటం వల్ల స్వీట్లు కేకుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.
అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో వీటిని మిఠాయి రంగు చెట్లు అని పిలుస్తుంటారు. కాకపోతే ఎన్నడూ లేనిది ఈ మొక్క ఇప్పుడు మన ఆ గిరిజన రైతులకు సిరులు కురిపిస్తుంది.జాఫ్రా మొక్కలు అన్నాటో కుటుంబానికి చెందినవి. జాఫ్రా దక్షిణ అమెరికా దేశాలైన మెక్సికో,బ్రెజిల్ లో పుట్టిందని చెబుతారు.15 శబ్దంలో స్పెయిన్,పోర్చుగీసు నావికుల ద్వారా ఇది మన దేశానికి వచ్చింది. అప్పటి నుంచి కేరళ లోని మలబారు ప్రాంతంలోనూ పశ్చిమ బంగాల్ ఈ శాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏజెన్సీలోనూ దీన్ని పండిస్తున్నారు.
ఏడాది పంట ఆశా జనకంగా ఉండడంతో వచ్చే ఏడాది 50 ఎకరాల్లో పంట వేయాలని అనుకుంటున్నాను అన్నాడు. ఐటీడీఏ ద్వారా పంటను కొనుగోలు చేస్తే మరింత మంది గిరిజనులు జాఫ్రా సాగుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌లోనూ సాగు వివరాలు తెలుసుకున్నా. అంతర్జాతీయ మార్కెట్‌లో జాఫ్రా గింజలకు కిలో 1,200 వరకు డిమాండ్ ఉన్నట్టు తెలిసిందన్నాడు.
ఒకప్పుడు పొలం గట్ల మీద ఇంటి వెనక పెరటి మొక్కలు గాను పెంచుతుండే వారు.పండిన వాటిని ఏజెన్సీ రైతులు గిరిజన సహకార సంస్థకి అమ్మేవాళ్లు.రెండేళ్ల కిందట దాకా వీటికి కిలోకి 18 రూపాయలే ఇచ్చేవారు. కానీ అమెరికా ప్రభుత్వం తిసుకున్న ఓ చిన్న నిర్ణయం ఇక్కడి రైతుల తలరాతల్ని మార్చేసింది. అమెరికాలో తయారు చేసే లేదా దిగుమతి చేసుకునే ఏ ఆహార పదార్థాలోను ఎటువంటి కృత్రిమ రంగుల్ని వాడకూడదన్నదే ఆ నిర్ణయం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార తయారీ సంస్థల దృష్టి ఈ గింజల పైన పడింది కర్ణాటక రాష్ట్రం మైసూరు లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చి ఇన్సిట్యూట్ జాఫ్రా నుంచి రంగుని సులువుగా తీసే ప్రత్యేక సాంకేతికతని కనిపెట్టింది.దీనిని ఉపయోగించుకొని మన దేశంలోని పలు సంస్థలు సహజ రంగుని తీసి విదేశాలకు విక్రయిస్తున్నాయి.మరో వైపు సౌందర్యసాధనాల పరిశ్రమలోను మార్పులొచ్చాయి.
ఇప్పుడు సహజ రంగులున్న లిప్ స్టిక్ల పేరుతో పూర్తిగా జాఫ్రా రంగుల్నే ఉపయోగిస్తున్నారు.వీటన్నిటి కారణంగా ఈ లిప్ స్టిక్ మొక్కలకి మాంచి గిరాకి పెరిగింది. వ్యాపారులు నేరుగా ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి రైతుల నుంచే కొంటున్నారు.బహిరంగ మార్కెట్లో వీటి ధర కిలోకి 100 రూపాయల దాకా పలుకుతోంది. ఎక్కడ 18 రూపాయలు ఎక్కడ 100 ప్రస్తుతం ఈ లిప్ స్టిక్ గింజల్ని దేశవ్యాప్తంగా ఏడాదికి 250 టన్నుల దాకా పండిస్తున్నారు.
ప్రయోజనాలు ఎన్నెన్నో,[object Object],ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా నిషేధించడంతో జాఫ్రా గింజలకు భారీగా డిమాండ్ పెరిగింది. జాఫ్రా గింజల వినియోగం పెరగడంతో ఇది వాణిజ్య పంటగా రూపుదిద్దుకుంది. కేవలం గింజేలా కాదు.. జాఫ్రా ఆకులను కామెర్లు, పాము కాటుకు మందుగా ఉపయోగిస్తారు. బెరడను గనేరియా వ్యాధి నివారణకు వినియోగిస్తారు. జీసీసీ ద్వారా జాఫ్రా గింజలను కిలో 100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు.
వీటిని పండించేందుకు రెండేళ్ల కిందట కొత్త కార్యక్రమం చేపట్టింది.అలా మొదలైన వీటి సాగు ఇప్పుడు రైతులు తమ పొలాల్లోనే ప్రత్యేకంగా పండించే స్థాయికి వచ్చింది.ఈ రకంగా ఈ మొక్కలు పెదవులనే కాదు గిరిజన రైతుల బతుకుల్ని పండిస్తున్నాయిప్పుడు.జాఫ్రా మొక్కలు కొండలు, గుట్టల్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి.
జాఫ్రా గింజలు (లిప్‌స్టిక్ గింజలు)..వినియోగాలు
ఈ గింజలను లిప్‌స్టిక్, సౌందర్య సాధనాలు, ఫుడ్ కలర్స్, ఆహార ఉత్పత్తులు, అద్దకాలు, మందుల తయారీకి వినియోగిస్తారు. అంతేకాదు ఆహార ఉత్పత్తుల్లో కృత్రిమ రంగుల వాడకాన్ని అమెరికా నిషేధించడంతో జాఫ్రా గింజలకు డిమాండ్ పెరిగింది. జాఫ్రా గింజల వినియోగం పెరగడంతో వాణిజ్య పంటగా మారిపోయింది.
జాఫ్రాతో ఉపయోగాలు..
జాఫ్రా ఆకులను కామెర్లు, పాము కాటుకు మందుగా కూడా ఉపయోగిస్తారు. జాఫ్రా మొక్క బెరడను గనేరియా వ్యాధి నివారణకు వినియోగిస్తారు.
COMMENTS