Lettuce Cultivation : పాలకూర సాగులో యాజమాన్య పద్దతులు
Lettuce Cultivation : పాలకూర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పీచు పదార్ధంతోపాటు అనేక ఖనిజలవణాలు పాలకూరలో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పాలకూరకు విపరీతమైన డిమాండ్ ఉంది. రైతులు అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న ఆకుకూర పంట్లలో పాలకూర కూడా ఒకటి. తక్కువ కాలంలోనే ఈ పంట చేతికందుతుండటంతో రైతులు సాగువైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకేసారి అధిక విస్తీర్ణంలో సాగు చేయకుండా, మార్కెట్ అవసరాలకు అనుకూలంగా సాగు చేయటం వల్ల రైతులకు మంచి అదాయం లభిస్తుంది.
పాలకూర ఉష్ణ ప్రాంతపు పంట. చలి, కొంతమేరకు మంచును తట్టుకుంటుంది. నీరు నిలిచే భూముల్లో ఈ పంట సాగు చేయకపోవటం మంచిది. మైదాన కొండ. ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. మురుగునీరు పోయే సౌకర్యమున్న అన్ని నేలల్లో పాలకూర సాగు చేయవచ్చు. ఇసుక నేలలు ఒండ్రు. నేలలు. సాగుకు. అత్యంత అనుకూలం. నీటి వసతిని బట్టి సంవత్సరం మొత్తం పాలకూర సాగు చేపట్టవచ్చు. ఎకరానికి 11కిలోల విత్తనం అవసరమౌతుంది.
సాగుకు అనువైన పాలకూర రకాలు ;
పూసా పాలక్ ; ఈ రకం పచ్చని మెత్తని ఆకులనిస్తుంది. విత్తే సమయాన్ని బట్టి ఆరుకోతల వరకు తీసుకోవచ్చు. దిగుబడి ఎకరాకు సుమారు 50 క్విటాళ్లు వస్తుంది.
పూసా జ్యోతి ; ఈ రకం వెడల్పైన పచ్చని, మందమైన, మెత్తని ఆకులను కలిగి ఉంటుంది. మొక్కలు వేగంగా పెరుగుతాయి. కోత తర్వాత త్వరగా పెరుగుతుంది. 6 నుండి 8 కోతలు తీసుకోవచ్చు. ఎకరాకు 120 క్వింటాళ్లకు పైగా ఆకు దిగుబడి వస్తుంది.
జాబనర్ గ్రీన్ ; ఆకుపచ్చని, దళసరి, మెత్తని ఏకరీతి ఆకులను కలిగి ఉంటుంది. సువాసన వస్తుంది. ఎకరాకు దిగుబడి 108 క్వింటాళ్లకు పైగా వస్తుంది.
పూసా హరిత్ ; చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువైనది. వెడల్పాటి ఆకులు కలిగి ఉంటుంది. త్వరగా విత్తనం ఏర్పడదు. అధిక దిగుబడినిచ్చే రకాల్లో ఇది ఒకటి.
విత్తిన 20రోజుల నుండి ప్రతి 15 రోజలుకు ఒకసారి కలుపు నివారణ, అంతరకృషి చేయాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీటి తడులివ్వాలి. మూడో రోజు నుండి 7 రోజులకొకసారి నీటి తడులివ్వాలి. నాటిన 5 నుండి 8వారాల త్వారా ఆకులు కోతకు సిద్ధంగా ఉంటాయి. 3 అంగుళాల ఆకులను కిందనుండి కోయాలి. మొత్తం ఆకులను ఒకేసారి కాకుండా విడతలవారీగా కోవటం మంచిది.
ప్రధానంగా పాలకూరలో పేను బంక , రసం పీల్చే పురుగుల బెడద ఎక్కవగా ఉంటుంది. ఇవి ఆశిస్తే ఆకులు ముడుతలు పడి మొక్కలు చనిపోతాయి. వీటిని గుర్తించిన వెంటనే 2గ్రా మలాథియాన్, ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందు పిచికారీ చేసిన వారం రోజుల తరుతనే ఆకులు కోయాలి.
COMMENTS