AIIMS BIBINAGAR లో జాబ్స్.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా టీచింగ్ పోస్టులు
తెలంగాణలోని బీబీ నగర్ లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను (AIIMS, BIBINAGAR) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీబీనగర్ ఎయిమ్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 94 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయి. ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ, అనాటమీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు:
S.No పోస్టు ఖాళీలు
1. ప్రొఫెసర్లు 29
2. అడిషనల్ ప్రొఫెసర్లు 11
3. అసోసియేట్ ప్రొఫెసర్లు 18
4. అసిస్టెంట్ ప్రొఫెసర్లు 36
మొత్తం: 94
విద్యార్హతల వివరాలు:పైన పేర్కొన్న స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు టీచింగ్ లేదా రీసెర్చ్ అనుభవం ఉండాలని వెల్లడించారు. అభ్యర్థులు నాన్ మెడికల్ అయితే ఆయా సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసిన వారై ఉండాలి.
ఇతర వివరాలు:-
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://aiimsbibinagar.edu.in/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
-దరఖాస్తు చేసుకున్న అనంతరం అప్లికేషన్ ఫామ్ ను బీబీనగర్ ఎయిమ్స్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
COMMENTS