ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. 4న మరో భారీ జాబ్ మేళా..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా (Job Mela) ను ప్రకటించింది సంస్థ. Beedata Technologies, TriGeo Technologies, ALIVIRA, Lakshmi Hyudai, Appollo Pharmacy సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను విశాఖ జిల్లాలోని పెందుర్తిలో నిర్వహించనున్నారు.
సంస్థల వారీగా ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి..
Beedata Technologies: ఈ సంస్థలో 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, బీటెక్, బెఎస్సీ/బీకామ్/ఎంఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం(మదురవాడ) లేదా హైదరాబాద్ (యూసఫ్ గూడ) లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
TriGeo Technologies Pvt. Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. బీటెక్/డిప్లొమా/డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16,827 వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంటి. వయస్సు 19 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
ALIVIRA: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18 ఏళ్లకు పైగా ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
Lakshmi Hyudai: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి, ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. అనకాపల్లి/గాజువాక/మురళినగర్ లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. అయితే కేవలం పరుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Apollo Pharmacies Limited: ఈ సంస్థలో 200కు పైగా ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డీ/బీ/ఎం ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది.
Registration --> LINK
COMMENTS