Intercrop : పత్తిలో అంతరపంటగా సోయాచిక్కుడు సాగు
Intercrop : ఏకపంట విధానం వల్ల రైతులకు కొన్ని సందర్భాల్లో ఆశించినంత మేర ఫలసాయం చేతికందటంలేదు. అదే అంతర పంటల పద్దతిని పాటిస్తే ఒక పంట ద్వారా ఫలసాయం తగ్గినా రెండో పంటపై వచ్చే లాభంతో నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు ముఖ్యంగా సోయా చిక్కుడు సాగులో చాలా మంది రైతులు ఇటీవలి కాలంలో అనేక ప్రయోగాలు చేసి మంచి దిగుబడులు, అదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా పత్తి పంటలో సోయాచిక్కుడుని అంతర పంటగా సాగు చేస్తే రైతులకు అదనపు అదాయం సమకూరుతుందన్న శాస్త్ర వేత్తల సూచనల నేపధ్యంలో ఆవైపు రైతులు అడుగులు వేస్తున్నారు. దీంతో పత్తిలో అంతర పంటగా సోయా చిక్కుడు సాగు చేసేందుకు ఆసక్తి పెరుగుతుంది.
పత్తిలో సోయా చిక్కుడు సాగు వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పత్తిని ఆశించే కీటకాల బెడద తగ్గుతుంది. నల్లరేగడి నేలల్లో అధిక వర్షాలు కురిసే టప్పుడు, పత్తి మొక్కలు చనిపోకుండా ఈ సోయాచిక్కుడు నివారిస్తుంది. సోయా చిక్కుడును పత్తిలో అంతరపంటగా వేసేటప్పుడు దాని సాళ్ల నిష్పత్తి పత్తి పంట సాళ్ల మధ్య అనుసరించే దూరాన్ని బట్టి, పత్తి రకాన్ని బట్టి, సోయాచిక్కుడు రకాన్ని బట్టి, మార్చుకోవలసి ఉంటుంది.
90 రోజుల్లోపు నిర్ణీత ఎత్తు మాత్రమే పెరిగే సోయా రకాలను పత్తి పంటలో అంతర్ పంటగా వేయాలి. జె.ఎస్ 335, జె.ఎస్ 93-05 రకాలను పత్తి పంటలో అంతర పంటగా వేయాలి. ఎకరాకు సుమారు 15 కిలోల సోయా విత్తనాలు సరిపోతాయి. సోయాచిక్కుడు సాళ్ల మధ్య దూరం 12 సెంటీ మీటర్లు ఉన్నప్పుడు మూడు వరసలు,90 సెం,మీ, లు ఉన్నప్పుడు రెండు వరుసలలో సోయా విత్తనాలు వేయాలి. పత్తిలో సోయాను అంతరపంటగా రెండుసార్లు వేసినప్పుడు హెక్టారుకు 690 కిలోల సోయాచిక్కుడు, 53 క్వింటాళ్ళ పత్తి దిగుబడి తీయవచ్చు.
అంతరపంటగా సోయాచిక్కుడును సాగు చేసేటప్పుడు వాటి వరుసల సంఖ్య మించకూడదు. సాళ్ల లో మొక్కల సాంద్రత ఎక్కువ కాకుండా చూడాలి. సోయా చిక్కుడు ను కోత సమయంలో కొడవళ్లతో కోయాలి. సోయాచిక్కుడు వేర్ల బుడిపెలు బాగా ఏర్పడడానికి రైజోబియం కల్చర్ ను విత్తనాలకు పట్టించాలి. విత్తనాలు పెట్టేటప్పుడు సాళ్ళ మీద నీడ పడకుండా ఉండాలంటే తూర్పు, పడమర గా నాటాలి. సోయాచిక్కుడు కు మొదటి 20- 25 రోజుల లోపు నత్రజనిని అందించాల్సి ఉంటుంది.
COMMENTS