IB Recruitment 2022: ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, అర్హతలు, దరఖాస్తు విధానం
భారత హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరోలో 766 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్యూరిటీ అసిస్టెంట్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులతోపాటుగా గ్రూప్ B, గ్రూప్ C పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ రిక్రూట్ మెంట్లో షార్ట్ లిస్ట్ అయన వారిని.. డిప్యుటేష్ ప్రాతిపదికన నియమిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 60 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్, స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ ఫోర్సెస్ కింద పని చేస్తున్న అధికారులు అయి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బయటి వారు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తారు. అప్లికేషన్ నింపిన తర్వాత.. దరఖాస్తు ఫామ్ ను.. అసిస్టెంట్ డైరెక్టర్/G-3, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 35 SP మార్గ్, బాపు ధామ్, న్యూఢిల్లీ-110021 చిరునామాకు పంపాలి.
మొత్తం 766 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ ఎగ్జిక్యూటివ్- 70, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్- 350, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ ఎగ్జిక్యూటివ్- 50, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్- 100, సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్- 100, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎంటీ- 20, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎంటీ- 35, సెక్యూరిటీ అసిస్టెంట్/ఎంటీ- 20, హల్వాయి- కమ్- కుక్- 9, కేర్ టేకర్- 5, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/టెక్- 7 పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్ జూన్ 22న విడుదలైంది. IB రిక్రూట్మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల కోసం దరఖాస్తు చేసేందుకు ముందు అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. పోస్ట్ వారీగా అవసరమైన విద్యార్హత, అవసరమైన పత్రాలు, ఇతర ముఖ్యమైన వివరాలను చూసుకోవాలి.
IB Recruitment 2022: భారత హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (intelligence Bureau) 766 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సెక్యూరిటీ అసిస్టెంట్, అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వంటి పోస్టులతో సహా గ్రూప్ B, గ్రూప్ C పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఐబీ రిక్రూట్మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించుకుంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలైన 60 రోజులలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in/ ను చూడొచ్చు. IB Recruitment 2022 కోసం సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కింద పని చేస్తున్న అధికారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
IB Recruitment 2022
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
అసిస్టెంట్ డైరెక్టర్/G-3,
ఇంటెలిజెన్స్ బ్యూరో,
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,
35 SP మార్గ్, బాపు ధామ్,
న్యూఢిల్లీ-110021
చిరునామాకి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
IB Recruitment 2022 - మొత్తం పోస్టులు: 766
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ ఎగ్జిక్యూటివ్- 70
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్- 350
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ ఎగ్జిక్యూటివ్- 50
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ ఎగ్జిక్యూటివ్- 100
సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్- 100
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎంటీ- 20
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎంటీ- 35
సెక్యూరిటీ అసిస్టెంట్/ఎంటీ- 20
హల్వాయి- కమ్- కుక్- 9
కేర్ టేకర్- 5
జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/టెక్- 7
COMMENTS